ప్రేమంటే ఇదేనా: ఒకప్పటి ప్రేమికులు..రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య

10TV Telugu News

ఇద్దరికీ పెళ్లైనా ప్రేమ చచ్చిపోలేదు : రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట ఆత్మహత్య 
ప్రేమ జంట రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో మాసాయిపేట సమీపంలో  జరిగింది. వీరిని ప్రేమ జంట అనాలో మరేమనాలో తెలీదు గానీ గతంలో ప్రేమించుకుని..వేరు వేరు పెళ్లిళ్లుఅయిన వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ప్రేమించుకున్న వీరిద్దరికీ వేరు వేరు పెళ్లిళ్లుచేశారు పెద్దలు. పెళ్లి తరువాత కూడా వారిద్దిరూ తరచు కలుసుకునేవారు.

ఇలా..ఎంతకాలం నువ్వు నేనూ వేరు వేరు వ్యక్తులతో కలిసిఉండటం..అలాగని కలిసి జీవించలేం..అందుకే చావులోనైనా ఇద్దరం కలిసే ఉందాం అనుకున్నారో ఏమో ఓ నిర్ణయానికి వచ్చి..ఇద్దరూ కలిసి వేగంగా వచ్చే రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్యకు చేసుకున్నారు. ఇదేదో సినిమా కాదు. మల్కాజగిరికి చెందిన ప్రేమ జంట మెదక్ జిల్లాలోని మాసయిపేట వద్ద రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. 

పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన యువతి 29 ఏళ్ల యువతీ..30 యువకుడికి బట్టల కొట్టులో అయిన పరిచయం…ఇద్దరు  బట్టల షాపులోనే పనిచేస్తుండటంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ఏం జరిగిందో ఏమోగానీ..ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా పెళ్లైన యువతికి భర్త, పదేళ్లలోపు వయసున్న ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. యువకుడికి కూడా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఇలా సాగుతున్న వీరి సంసారంలో గతంలో ఉన్న ప్రేమ నిప్పు రాజేసింది. సదరు యువతి మంగళవారం (మే 19,2020)న భర్తతో గొడవ పడింది. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ నోట్  రాసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

అలా కలిసిన ఇద్దరూ బైక్‌పై మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బైక్ పార్క్ చేశారు. అదే టైముకు నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న రైలు కనిపించింది. ఇద్దరూ కలిసి చేతులు పట్టుకుని వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నారు. ఇది గనించిన లోకో పైలట్ రైలు ఆపి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనేవచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఆత్మహత్య చేసుకున్నవారిద్దరూ..

మల్కాజిగిరి వాసులుగా గుర్తించారు. తరువాత వారి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  విచారణలో భాగంగా వారిద్దరూ గతంలో ప్రేమించుకున్నారనీ..అయినా తరచూ కలుసుకోవటం..ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.