ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో భారీ అవినీతి : ప్రభుత్వానికి రూ.110 కోట్ల టోకరా

ఇఎస్ ఐ, ఐఎంఎస్ స్కామ్ లో తవ్విన కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ దేవికారాణిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించారు.

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 11:19 AM IST
ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో భారీ అవినీతి : ప్రభుత్వానికి రూ.110 కోట్ల టోకరా

ఇఎస్ ఐ, ఐఎంఎస్ స్కామ్ లో తవ్విన కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ దేవికారాణిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించారు.

ఇఎస్ ఐ, ఐఎంఎస్ స్కామ్ లో తవ్వినకొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ దేవికారాణిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించారు. షెల్ కంపెనీల పేరుతో దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ బయటపెట్టింది. వీరి సహకారంతో ఓమిని ఫార్మా కంపెనీ చైర్మన్ శ్రీహరిబాబు.. ప్రభుత్వానికి రూ.110 కోట్ల టోకరా పెట్టినట్లు తేలింది. శ్రీహరి బాబుకు రూ.99 కోట్ల షేర్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఓమిని చైర్మన్ శ్రీహరిబాబుకు దేవికారాణి, పద్మ పూర్తి సహకారం అందించారు.

 

లెజెండ్ పేరుతో షెల్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ షెల్ కంపెనీకి యజమానిగా కృపా సాగర్ రెడ్డి ఉన్నారు. లెజెండ్ కంపెనీకి ప్రభుత్వం రూ.54 కోట్లు చెల్లించింది. మొత్తం డబ్బులు లెజెండ్ ఎకౌంట్స్ నుంచి శ్రీహరి బాబు ఎకౌంట్స్ కు బదిలీ అయ్యాయి. తెల్లరక్త కణాల కిట్స్ కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. గ్లూకోజ్ క్యూయేట్ కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయని గుర్తించారు. 11800కు సంబంధించి మందులను దాదాపు 36 వేల 800 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

 

దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.54 కోట్లను శ్రీహరిబాబుకు చెల్లించనట్లుగా ఆధారాలు సేకరించారు. మందులు కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. దేవికారాణి రూ.1980 విలువైన క్యూయేట్ ను రూ.6200కు కొనుగోలు చేసింది. ఓమిని చైర్మన్ శ్రీహరిబాబు..సుమారు రూ.13 కోట్లు అధికంగా దోచుకున్నాడు. శ్రీహరిబాబును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లెజెండ్ కంపెనీ యజమాని కృపా సాగర్ రెడ్డి, ఓమిని ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 

 

ఐఎస్ ఐ స్కాంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశారు. మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తప్పుడు పత్రాలు, నకిలీ సంతకాలతో విచ్చవిలవిడిగా కోట్ల రూపాయల డబ్బులను కొల్లగొట్టినట్లుగా ఆధారాలను సేకరించారు. జాయింట్ డైరెక్టర్ పద్మ..మాజీ డైరెక్టర్ దేవికారాణితో చేతులు కలిపి భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.