ముంబై డీవై పాటిల్ లేడీస్ హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై డీవై పాటిల్ లేడీస్ హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం

భారత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేవీ ముంబైలోని నీరౌల్ ఏరియాలోని డీవై పాటిల్ లేడీస్ హాస్టల్ లో బుధవారం(మార్చి-18,2020)మద్యాహ్నాం 1:45గంటల సమయంలో హాస్టల్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదం జరిగిన యూనివర్శిటీ హాస్టల్ కాంపౌండ్ లోనే ఓ హాస్పిటల్,స్టేడియం కూడా ఉంది. ఈ ప్రమాదంలో ఎవరెవరికీ గాయాలయ్యాయి వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు.

కొన్ని రిపోర్ట్ ల ప్రకారం అగ్ని ప్రమాదం మొదట హాస్పిటల్ లో సంభవించినట్లు తెలియగా,అయితే మరికొన్ని రిపో్ర్టులు…డీవై పాటిల్ స్టేడియం దగ్గర అగ్నిప్రమాదం మొదట సంభవించినట్లు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పెద్ద ఎత్తున ఫైరింజన్లు స్పాట్ కు చేరుకున్నాయి.

Also Read | మహిళ హత్య కేసులో సంచలన విషయాలు… ఉరి వేసి, బండరాయితో మోది చంపేశారు