Mehul Choksi Gets bail : మెహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు చేసిన డొమినికా హైకోర్టు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డోమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Mehul Choksi Gets bail : మెహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు చేసిన డొమినికా హైకోర్టు

Mehul Choksi Gets Bail

Mehul Choksi Gets bail : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డోమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆనారోగ్య కారణాలతో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేసిన డొమినికా కోర్టు … ఆంటిగ్వా, బార్బుడా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆంటిగ్వాలో వైద్య చికిత్సల కోసం మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

చికిత్స అనంతరం డొమినికాకు తిరిగి రావాలని చెప్పింది. న్యూరాలజిస్ట్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో వైద్య సంరక్షణ కోసం ఆంటిగ్వా మరియు బార్బుడాకు వెళ్లడానికి అనుమతించాలని చోక్సి యొక్క న్యాయవాది డొమినికా హైకోర్టును కోరారు.అందుకు సంబంధించిన చికిత్స డొమినికాలో అందుబాటులో లేదని చోక్సీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

తన మేనల్లుడు నీరవ్ మోడీతో కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ను రూ.13,500 కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్‌ చోక్సీ 2018లో భారత్‌ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయిన విషయం తెలిసిందే. మే 23న విందు కోసం వెళ్లిన చోక్సీ ఆ తర్వాత డొమినికాలో కనిపించాడు. డొమినికాలోకి చోక్సీ అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.

చోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు చేసిన విజ్ఞప్తిని భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆంటిగ్వా నుంచి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే డొమినికాలో పట్టుబడినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆంటిగ్వా బీచ్‌ నుంచి కిడ్నాప్‌ చేసి డొమినికాకు తీసుకువచ్చారని చోక్సీ ఆరోపించారు.

ఆంటిగ్వా మరియు బార్బుడా పౌరసత్వాన్ని చోక్సీ మోసపూరితంగా తీసుకున్నట్లు భారత ప్రభుత్వం కూడా కోర్టు ముందు పేర్కొంది. కాగా గతేడాది లండన్ లో అరెస్టై ప్రస్తుతం వాండ్స్ వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోడీని దేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. నీరవ్ మోడీతో పాటు పీఎన్బీ స్కాంలో సహ నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ అక్కడినుంచి క్యూబావెళ్లాలని ప్రయత్నంలో ఉండగా డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.