Illegal Affair : అక్రమ సంబంధం కొనసాగించాలని యువతిపై దాడి

నెల్లూరులో నర్సుగా పని చేస్తున్న యువతిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆ యువతి ఎదురు దాడి చేసింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.

Illegal Affair : అక్రమ సంబంధం కొనసాగించాలని యువతిపై దాడి

Nellore Illegal Affair

Illegal Affair : నెల్లూరులో నర్సుగా పని చేస్తున్న యువతిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆ యువతి ఎదురు దాడి చేసింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.

సత్యనారాయణపురానికి చెందిన అరుణ అనే యువతి నెల్లూరులోని   ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. అదే హస్పటల్ లో పని చేసే ఒక హోమియో వైద్యునితో  గత కొన్నేళ్ళుగా  వివాహేతర  సంబంధం  కొనసాగిస్తోంది.  ఇటీవలి కాలంలో ఆ డాక్టర్  వ్యవహారం నచ్చక పోవటంతో అతనికి దూరంగా ఉండసాగింది.

ఇది నచ్చని డాక్టర్.. ఆమెను అక్రమ సంబంధం కొనసాగించాలని బెదిరిస్తూ,  కొందరు వ్యక్తులతో ఆమెపై దాడి చేయించాడు. డాక్టర్ కు చెందిన మనుషులు ఆమెపై దాడి చేయగా వారిని ఎదుర్కోని  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

డాక్టర్ తో తనకు ప్రాణ హాని ఉందని….డాక్టర్ అయిన తన ప్రియుడే తనపై కొందరు వ్యక్తులతో దాడి చేయించాడని…తన  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాక్టర్ నుంచి తనను రక్షించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న దర్గామిట్ట  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.