మతి స్ధిమితంలేని మైనర్ చెల్లిపై అత్యాచారం చేసిన సోదరుడు

  • Published By: murthy ,Published On : May 25, 2020 / 07:17 AM IST
మతి స్ధిమితంలేని మైనర్ చెల్లిపై అత్యాచారం చేసిన సోదరుడు

తోడబుట్టిన చెల్లెలు మతిస్ధిమితం లేక పోవటంతో కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ అన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడాల్సినవాడు కామాంధుడై చెల్లి జీవితానికి చరమగీతం పాడాడు.  10ఏళ్ల చిన్నారిపై తాను అత్యాచారం చేయటమే కాక… తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి హత్య చేయటం సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు.  మే 17న  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

రాజస్థాన్, జైపూర్ లోని మనోహర్ పూర్ చెందిన 10 ఏళ్ల బాలికకు మతిస్థిమితం సరిగా లేదు. మే 17వ తేదీన తన కుమార్తె కనిపించటం లేదని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

3 రోజుల తర్వాత పోలీసులు సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కేసు విచారణలో బాలికను చివరిసారిగా ఆమె సోదరుడితో చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా..స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆమెను గొంతు కోసిహత్య చేసినట్లు చెప్పాడు. దీంతో అతడితోపాటు అత్యాచారం చేసిన మరో ముగ్గరు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా  నిందితులంతా 19 నుంచి 21 సంవత్సరాల వయస్సు కలిగిన వారుగా పోలీసులు గుర్తించారు.

Read: టిక్ టాక్ వీడియోలు చేయొద్దన్నందుకు తల్లీ, కొడుకులపై దాడి