బ్యాంకు లాకర్ లో బాంబులు 

  • Published By: chvmurthy ,Published On : January 26, 2020 / 07:35 AM IST
బ్యాంకు లాకర్ లో బాంబులు 

మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టిన ఆదిత్యారావును పోలీసులు విచారిస్తుంటే పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడి ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యమయ్యింది. అంతేకాక కర్ణాటక బ్యాంకులోని లాకర్లో బాంబు తయారీకి వుపయోగించిన వస్తవులను భద్రపరిచినట్లు చెప్పాడు.  

విచారణలో భాగంగా  పోలీసులు అతడిని ఉడిపిలోని కర్ణాటక బ్యాంకుకు తీసుకువెళ్లారు. అక్కడ సోదాలు నిర్వహించగా బ్యాగులో తెల్లటి పొడిలాంటి పదార్దం కనిపించింది,.అది సెనైడ్ గా పోలీసులు గుర్తించారు. విమానాశ్రయంలో బాంబు పెట్టే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే సెనైడ్ టచ్ చేసి బాంబు పెట్టాలని  నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. గత ఆరునెలలుగా సెనైడ్ ను బ్యాంకు లాకర్ లోనే భద్రపరచినట్లు చెప్పాడు.

మంగుళూరు ఎయిర్ పోర్టులో బాంబు పెట్టిన రోజు ఉడుపిలోని వడాంభేశ్వర ఆలయానికి వెళ్లినట్లు నిందితుడు తెలిపాడు. కాగా వడాంభేశ్వర ఆలయం నుంచి జిమ్ కోచ్కు తన సిమ్ కార్డు నుంచి ఫోన్ చేసినట్లు ఆదిత్యరావు చెప్పాడు. విచారణలో భాగంగా పోలీసులు ఎంత ప్రయత్నించినా అదిత్యరావు ఉపయోగించిన సిమ్ కార్డు దొరకలేదు.