క్వారంటైన్ కు వెళ్లాలని అనడంతో ఉరేసుకున్న యువకుడు

  • Published By: madhu ,Published On : June 1, 2020 / 06:01 AM IST
క్వారంటైన్ కు వెళ్లాలని అనడంతో ఉరేసుకున్న యువకుడు

కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే..క్వారంటైన్ కు వెళ్లాలని గ్రామస్తులు చెప్పడంతో కోపంతో క్షణికావేశంలో ఉరి వేసుకున్నాడు యువకుడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

భారతదేశంలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. యూపీలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సహద్లిపూర్ గ్రామానికి చెందిన సూరజ్ సింగ్ యాదవ్ (23) మహారాష్ట్రలోని నాసిక్ లో వడ్రంగి పనిచేస్తుండే వాడు. అయితే…కరోనా కారణంగా..లాక్ డౌన్ విధించడంతో సొంత గ్రామానికి చేరుకున్నాడు. చాలా రోజులు కావడంతో..తన కుటుంబసభ్యులను కలుస్తానని అతను ఆశగా వచ్చాడు. 

2020, మే 15వ తేదీన చేరుకున్న అనంతరం..అతడిని అపోలో కాలేజీలోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. కానీ…మే 23వ తేదీ నుంచి క్వారంటైన్ నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. కానీ..గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. క్వారంటైన్ కాలం పూర్తి చేసిన తర్వాతే..ఇంటికి రావాలని సూచించారు.

కానీ…సెంటర్ లో ఇతను కనిపించలేదు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు ఎనిమిది రోజుల తర్వాత..గంగా నది ఒడ్డున ఉన్న జమదా ఆశ్రమం సమీపంలో ఉన్న చెట్టుకు సూరజ్ సింగ్ యాదవ్ ఉరి వేసుకుని విగతజీవుడిగా కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Read: విశాఖలో కొంప ముంచిన పార్టీ : స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరు మృతి