Crime News: అమ్మను, అక్కను కొడుతున్నాడని.. తండ్రిని బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టి చంపిన బాలుడు

తండ్రి ఏ పనీ చేయడు.. ప్రతిరోజు తాగి వచ్చి అమ్మను, అక్కను కొడుతుంటాడు. తాగుడికి డబ్బులు ఇవ్వాలని వేధిస్తుంటాడు. దీంతో ఓ బాలుడు విసిగిపోయాడు. తన తండ్రిని ఎలాగైనా చంపేసి, తన తల్లికి, అక్కకు అతడి నుంచి విముక్తి కలిగించాలని భావించాడు. చివరకు తల్లి, అక్క ఇంట్లో లేని సమయంలో బేస్ బాల్ బ్యాట్‌తో తన తండ్రిని కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Crime News: అమ్మను, అక్కను కొడుతున్నాడని.. తండ్రిని బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టి చంపిన బాలుడు

Crime News

Crime News: తండ్రి ఏ పనీ చేయడు.. ప్రతిరోజు తాగి వచ్చి అమ్మను, అక్కను కొడుతుంటాడు. తాగుడికి డబ్బులు ఇవ్వాలని వేధిస్తుంటాడు. దీంతో ఓ బాలుడు విసిగిపోయాడు. తన తండ్రిని ఎలాగైనా చంపేసి, తన తల్లికి, అక్కకు అతడి నుంచి విముక్తి కలిగించాలని భావించాడు. చివరకు తల్లి, అక్క ఇంట్లో లేని సమయంలో బేస్ బాల్ బ్యాట్‌తో తన తండ్రిని కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. ఓ వ్యక్తి నాలుగో అంస్తులోని తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న విషయంపై సమాచారం అందకుని అక్కడకు వెళ్లామని అన్నారు. తన భర్తతో గొడవ పడి బంధువుల ఇంటికి వెళ్లానని, ఇంతలో తన భర్తను ఎవరో చంపేశారని నిందితుడి తల్లి పోలీసులకు తెలిపింది.

తమ సొంత ప్రాంతం ఉత్తరాఖండ్ లోని చమోలీ అని, ఢిల్లీకి ఉపాధి కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నామని ఆ మహిళ వివరించిందని పోలీసులు అన్నారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి చూశామని, అయితే, అందులో హత్యకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. తమకు బాలుడిపై అనుమానం వచ్చి, విచారించగా, చేసిన నేరాన్ని అతడు ఒప్పుకున్నాడని తెలిపారు. హత్య చేసేందుకు ఆ బాలుడికి మరో ముగ్గురు స్నేహితులు కూడా సహకరించారని అన్నారు.

తన తల్లిని, అక్కను డబ్బుల కోసం తండ్రి ప్రతిరోజు వేధించేవాడని, డబ్బులు ఇవ్వకపోతే కొట్టేవాడని ఆ బాలుడు చెప్పినట్లు పోలీసులు వివరించారు. దీంతో తన స్నేహితులతో కలిసి వచ్చి తన తండ్రిని బేస్ బాల్ బ్యాట్‌, కర్రలతో కొట్టి చంపేశానని చెప్పాడని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..