Minor Girl Kidnapped : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడు

బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పంజాబ్ తీసికెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడిని   హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Minor Girl Kidnapped : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడు

Minor Girl Kidnapped And Married

Minor Girl kidnapped and married : బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పంజాబ్ తీసికెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడిని   హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బీహార్ కు   చెందిన ఓ మైనర్ బాలిక కుటుంబం బతుకు తెరువు కోసం చాలా ఏళ్లక్రితం హైదరాబాద్ కి వలస వచ్చి మల్లాపూర్ లో నివాసం ఉంటోంది. ఆ ఇంట్లోని మైనర్ బాలిక ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీనుంచి కనిపించకుండా పోయింది. దీంతో తల్లితండ్రులు తమ కుమార్తె కనిపించటంలేదని పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బాలిక వద్ద ఉన్న ఫోన్ నెంబరు ఆధారంగా బాలిక పంజాబ్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పంజాబ్ వెళ్లి బాలికను.. ఆమెను తీసుకువెళ్లిన సోనూ కుమార్ అనే యువకుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు.

పంజాబ్ కు చెందిన సోనూ కుమార్ ఠాగూర్ (19) అనే యువకుడు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మల్లాపూర్ లో నివాసం ఉంటూ మైనర్ బాలిక కుటుంబం నివసిస్తున్న ఇంటి సమీపంలోనే ఉండేవాడు.

ఆ క్రమంలో మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తానంటూ బాలికకు మాయమాటలు చెప్పిన సోనూ కుమార్ బాలికను పంజాబ్ తీసుకువెళ్లాడు.

అక్కడ వివాహం చేసుకుని, ఇల్లు అద్దెకు తీసుకుని బాలికతో కాపురం చేస్తున్నాడు. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.