Minor Girl: మాయమాటలతో మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు

మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట్‌లో ఉంటున్న మైనర్ బాలికను, బాలాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకుని వెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Minor Girl: మాయమాటలతో మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు

Minor Girl

Minor Girl: మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా బాలికలు మోసపోతున్నారు. ఒక వ్యక్తి పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసగించి తీసుకెళ్లిన ఘటన తాజాగా హైదరాబాద్ పరిధిలో వెలుగుచూసింది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట్‌లో ఉంటున్న మైనర్ బాలికను, బాలాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకుని వెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి రెండు వారాలవుతోంది.

militants killed: కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు తీవ్రవాదులు హతం

ఇప్పటికీ వాళ్ల ఆచూకీ తెలియలేదు. ఇంకా బాలిక ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలియకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ స్నేహితులను తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, అప్పటికే సతీష్‌కు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. కాగా, తమ కూతురును కనీసం ప్రాణాలతో తీసుకురావాలని బాలిక తల్లిదండ్రులు పోలీసుల్ని వేడుకుంటున్నారు.