Minor Girl Raped : మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఆటోరిక్షాలను తనిఖీ చేస్తున్న అధికారులు

14 ఏళ్ల బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ హోటల్‌లో రూం ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పి, తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

10TV Telugu News

Minor Girl Raped :  బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఒకరాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇంకో రాష్ట్రంలో జరగటంలేదని ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 14 ఏళ్ల బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ హోటల్‌లో రూం ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పి, తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహారాష్ట్రలోని పూణే‌లో ఇటీవల మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నేపధ్యంలో నగరంలో అక్రమంగా తిరుగుతున్న ఆటోరిక్షాలపై అధికారులు దాడులు చేశారు. ఆర్టీయే అధికారులు, పోలీసులు 10 రోజుల్లో దాడులు చేసి 41 ఆటో రిక్షాలను సీజ్ చేసి 486 మంది ఆటోడ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. పూణే రైల్వే స్టేషన్, సర్గేట్, శివాజీనగర్, బెనర్ లలో ఆటో రిక్షాలపై ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Also Read : Extra Marital Affair : వివాహేతర సంబంధం-పుట్టే బిడ్డ కోసం కొట్టుకున్నఇద్దరు ప్రియులు

ఎక్కవ ఆటోలను పూణే రైల్వే స్టేషన్ ప్రాంతంలో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది డ్రైవర్లకు లైసెన్స్ లు కూడా లేవు. వెహికవల్స్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని ఆర్టీవో అధికారి ఒకరు తెలిపారు. ఆటో రిక్షాలను క్రమబద్ధీకరించటానికి పోలీసు శాఖ ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈలోగా ఆటోల యజమానులు తమ వివరాలు పోలీసుల వధ్ద నమోదు చేయించుకోవాలని  చెప్పారు. నిబంధనలు పాటించని ఆటోలపై అక్టోబర్ 1 నుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వివరించారు.