Minor Girl Raped : ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్‌లో మరో మైనర్‌ బాలికపై అత్యాచారం

హైదరాబాద్ లో మైనర్ బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. వరుసగా దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బర్త్ డే పార్టీకి పిలిచి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Minor Girl Raped : ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్‌లో మరో మైనర్‌ బాలికపై అత్యాచారం

Minor Girl Raped (1)

Minor Girl Raped : హైదరాబాద్ లో మైనర్ బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. వరుసగా దారుణాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడో ఒక చోట బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు.. లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మాయమాటలు చెప్పి ఒకడు, నమ్మించి మరొకడు, కిడ్నాప్ చేసి ఇంకొకడు.. కామంతో కాటేస్తున్నారు. జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన, పాతబస్తీలో లైంగిక దాడుల ఘటనలు మరువక ముందే.. నగరంలో మరో మైనర్ బాలికపై రేప్ జరిగింది.

Sexual Assault : హైదరాబాద్‌లో ఆగని అత్యాచార ఘటనలు..నగరంలో మరో రెండు దారుణాలు

నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్ లో బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను బర్త్ డే పార్టీకి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను కారులో నెక్లెస్ రోడ్ కి తీసుకెళ్లిన సురేశ్ అనే వ్యక్తి.. లైంగిక దాడి చేశాడు. రాంగోపాల్ పేట పోలీసులు సురేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Jubilee Hills Gang Rape Case : జూబ్లీ‌హిల్స్ గ్యాంగ్‌ రేప్ కేస్ : మరో బాలికపైనా వేధింపులు

బాధితురాలు ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. జిరాక్స్ షాప్ లో పని చేసే సురేశ్ తో బాలికకు పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లుగా వీరి మధ్య స్నేహం ఉంది. బాలికకు సురేశ్ ఫోన్లు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మైనర్ బాలిక స్నేహితుడు రాహుల్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా నెక్లెస్ రోడ్ కి వెళ్లింది. సురేశ్ ని కూడా ఆ బర్త్ డే పార్టీ వేడుకలకు వచ్చాడు. ఇదే అదనుగా.. అందరూ బర్త్ డే పార్టీలో ఉండగా.. సురేశ్.. బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు ఈ విషయాన్ని పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన రాంగోపాల్ పేట పోలీసులు.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.