ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే అది లైంగిక సంబంధం పెట్టుకోటానికి అనుమతిచ్చినట్టు కాదు- హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు

ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే అది లైంగిక సంబంధం పెట్టుకోటానికి అనుమతిచ్చినట్టు కాదు- హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు

Minor girl sending a friend request on Facebook does not give accused the liberty to establish sexual relations : సోషల్ మీడియా ప్లాట్ ఫాం పేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే అంది లైంగిక సంబంధం పెట్టుకోడానికి వేధింపులకు గురి చేయటానికి అనుమతిచ్చినట్లు కాదని హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు వ్యాఖ్యానించింది.

13 ఏళ్ల బాలికి 19 ఏళ్ల యువకుడికి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అది యాక్సెప్ట్ చేసిన యువకుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి బాలికను హోటల్ కు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టైన యువకుడి బెయిల్ పిటీషన్ పై ఇటీవల విచారణ జరిగింది. ఈ క్రమంలో బాలిక తన వయస్సు గురించి నిందితుడికి తప్పుడు సమాచారం ఇచ్చిందని  పిటీషనర్ తరుఫు న్యాయవాది  వాదించారు.

దీనికి స్పంధించిన న్యాయమూర్తి… నెటిజన్లు సోషల్ మీడియాలో గోప్యత పాటించటం సహజమే… ప్రెండ్ రిక్వెస్ట్ పంపినంత మాత్రాన ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోటానికి అనుమతిచ్చినట్లు కాదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను ప్రజలు జ్ఞానం,వినోదం కోసం ఉపయోగిస్తారని దాని ద్వారా లైంగిక మానసిక వేధింపులకు గురిచేయరాదని జస్టిస్ అనూప్ చిట్కారా వ్యాఖ్యానిస్తూ నిందితుడి బెయిల్ పిటీషన్ రద్దు చేశారు.

ప్రజలు తమ విజ్ఞానాన్ని పెంచుకోటానికి   తమకున్న స్నేహితుల పరిధి పెంచుకోటానికి ఫేస్ బుక్. ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చేరతారు. UNDP ప్రచురించిన సోషల్ మీడియా ఫర్ యూత్ అండ్ సివిల్ ఎంగేజ్ మెంట్ ఇన్ ఇండియా అనే నివేదిక ప్రకారం భారతదేశంలో అన్నివయస్సులవారితో కలిపి 290 మిలియన్ మంది ఫేస్ బుక్ వినియోగ దారులు ఉన్నారు.

వీరిలో 190 మిలియన్ల మంది 15-29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారని పేర్కోంది. వారంతా మొత్తం జనాభాలో 27 శాతం మాత్రమేనని వారంతా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై ఉంటారని నివేదిక వెల్లడించింది.