హైదరాబాద్ లో మరో మిస్సింగ్ మిస్టరీ : డిసెంబర్ 26 నుంచి కనిపించని ఐటీ ఉద్యోగిని

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 05:19 AM IST
హైదరాబాద్ లో మరో మిస్సింగ్ మిస్టరీ : డిసెంబర్ 26 నుంచి కనిపించని ఐటీ ఉద్యోగిని

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 11 రోజులు అవుతున్నా.. రోహిత ఆచూకీ దొరకడం లేదు. 2019 డిసెంబర్ 26న మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కింది రోహిత. ఆ తర్వాత ఏం జరిగింది? ఎటు వెళ్లింది? జరగరాని ఘోరం ఏదైనా జరిగిందా? ఇలా అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు.

ఆపిల్ కంపెనీలో పనిచేస్తున్న రోహిత కుత్తూరు డిసెంబర్ 26న మధ్యాహ్నం 3.15 గంటలకు గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు. ఇంటి నుంచి వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు మొత్తం గాలించారు. ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్లడంతో రోహిత ఆచూకీ తెలుసుకోవడం సమస్యగా మారింది. 3 రోజుల వెతుకులాట తర్వాత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. దర్యాఫ్తు కోసం సైబరాబాద్ పోలీసులు రెండు టీమ్‌లను నియమించారు. రోహిత ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆచూకీ తెలిస్తే చెప్పాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

missing

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు చోటు చేసుకున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రోహిత ఇన్సిడెంట్ జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన హీట్ చల్లారకముందే సైబరాబాద్ కమిషనరేట్ లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. రోహిత నానక్ రామ్ గూడ్ లోని ప్లాట్ లో నివాసం ఉంటోంది. అదృశ్యమైన రోజున గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కవటం వరకు క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చేదించాల్సి ఉంది.

కుటుంబసభ్యులు ఆలస్యంగా ఫిర్యాదు చేయటం కూడా రోహిత మిస్సింగ్ కేసు మరింత కష్టంగా మారేలా చేసిందని పోలీసులు అంటున్నారు. డిసెంబర్ 26న ఆమె కనిపంచకుండాపోతే… డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాతే కావటంతో సైబరాబాద్ పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. రోహిత ఆచూకీని కనిపెట్టేందకు రెండు బృందాలను నియమించారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఆటో దిగి రోడ్డు క్రాస్ చేసే వరకు సీసీటీవీ ఫుటేజ్ సంపాదించగలిగారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ బ్లర్ ఉండటంతో రోహిత ఆచూకీ కనుక్కోవటం కష్టంగా మారిందని పోలీసులు అంటున్నారు. త్వరలోనే రోహిత ఆచూకీ కనుక్కుంటామని పోలీసులు నమ్మకం వ్యక్తం చేశారు.

రోహిత మిస్సింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది. అసలేం జరిగిందో అని అంతా టెన్షన్ పడుతున్నారు. రోహిత ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, సేఫ్ గా ఇంటికి చేరాలని కుటుంబసభ్యులు, మిత్రులు, ఆఫీస్ సిబ్బంది ప్రార్థిస్తున్నారు.

* సైబరాబాద్ లో మరో మిస్సింగ్ ఘటన
* డిసెంబర్ 26న కనిపించకుండా పోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్
* 26న విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కిన రోహిత
* ఆ రోజు నుంచి రోహిత ఆచూకీ లేదు
* డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంసభ్యులు
* 11 రోజులు అవుతున్నా దొరకని జాడ

* హైదరాబాద్ యాపిల్ ఉద్యోగి రోహిత మిస్సింగ్ కేసులో వీడని మిస్టరీ
* 11 రోజులుగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్న రోహిత
* రోహిత అదృశ్యంపై కుటుంబసభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన
* ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలివెళ్లిన రోహిత
* నిన్న (జనవరి 5,2020) సికింద్రాబాద్ లో రోహిత కనిపించినట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు
* రోహిత ఎందుకు వెళ్లిందో తెలియదంటున్న కుటుంబసభ్యులు
* రోహిత కాల్ డేటా, వాట్సాప్ డేటాను సేకరిస్తున్న పోలీసులు
* 5 ప్రత్యేక బృందాలతో రోహిత కోసం గాలింపు