Maoist Attack : నక్సల్స్ దాడి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే

మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో ఎమ్మెల్యే ప్రాణాలతో తప్పించుకున్నారు. చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ ఈరోజు ఓర్చా గ్రామ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది.

Maoist Attack : నక్సల్స్ దాడి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే

Chhattisgarh

Maoist Attack : మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో ఎమ్మెల్యే ప్రాణాలతో తప్పించుకున్నారు. చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ ఈరోజు ఓర్చా గ్రామ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఐటీబీటీ 45వ బెటాలియన్ జవాన్ల ఆయన వెళ్లే రహదారిలోని డోంగేర్ గుట్ట వద్ద తనిఖీలు చేపట్టారు.

ఈక్రమంలో మాటు వేసిన మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ మరణించాడు. మరోకరికి గాయలయ్యాయని ఏఎస్‌పీ నీరజ్ చంద్రకర్ తెలిపారు.  ఎమ్మెల్యే లక్ష్యంగా మవోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అంతకు 10 నిమిషాల ముందే ఎమ్మెల్యే కాన్వాయ్ అదే దారి వెంట వెళ్లింది. మావోల దాడితో ఎమ్మెల్యే తన పర్యటన వాయిదా వేసుకున్నారు.

మరో వైపు…. పోలీసు ఉద్యోగాల సెలక్షన్ కోసం వెళ్లారనే కారణంతో ఏడుగురు గిరిజన యువకులను మవోయిస్టులు కిడ్నాప్ చేశారు. చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లా జేగురుగొండకు చెందిన యువకులు ఇటీవల పోలీసు రిక్రూట్ మెంట్ కు వెళ్లారు. గిరిజనులు పోలీసు ఉద్యోగాల్లో చేరటం ఇష్టం లేని మవోయిస్టులు ఏడుగురు యువకులను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. వారిని వెతుక్కుంటూ వెళ్లిన మరో నలుగురిని కూడా మావోయిస్టులు బంధించారు. తమ వాళ్లకు ఎటువంటి హాని తల పెట్టవద్దని కిడ్నాప్ కు గురైన యువకులు కుటుంబాలు మావోయిస్టులకు విజ్ఞప్తి చేసాయి.

కాగా…..బీజాపూర్ జిల్లా గంగళూరులో వింజమ్ రామ్ అనే మాజీ నక్సలైట్ ను మవోయిస్టులు హత్య చేశారు. 9 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన వింజమ్ రామ్ పోలీసు ఏజెంట్ గామారాడని ఆరోపిస్తూ మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పదేరాలోని వారాంతపు సంతకు వెళ్లి అక్కడ వింజమ్ రామ్ ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి మావోలు హత్య చేశారు.