Cyber Crime : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. ఆ యాప్‌తో జాగ్రత్త, లేదంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మి దగా పడుతున్నారు. జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

Cyber Crime : సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మి దగా పడుతున్నారు. జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
తాజాగా ఎయిర్ టెల్ కస్టమర్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ సైబర్ క్రిమినల్ దగా చేశాడు. వైఫై, ఆన్‌లైన్ సేవలను ఉచితంగా పొందేందుకు ఓ యాప్ డౌన్ లోడ్ చేయించి అతడి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.3.94లక్షలు దోచుకున్నాడు.
మారేడుపల్లి మహీంద్రాహిల్స్‌కు చెందిన అశోక్ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నా డు. కొన్ని రోజుల క్రితం గౌరవ్ అనే వ్యక్తి ఎయిర్‌టెల్ సంస్థ ప్రతినిధిని అంటూ ఫోన్ చేశాడు. వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే ‘రీచార్జ్ ట్యూబ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. అయితే అది నిజమో కాదో అశోక్ నిర్దారించుకోలేదు. గుడ్డిగా అతడి మాటలు నమ్మేశాడు. ఫోన్ లో వ్యక్తి చెప్పిన విధంగా యాప్ డౌన్‌లోడ్ చేశాడు. ముందుగా రూ. 10తో మొబైల్ నెంబర్‌కు రీచార్జ్ చేయాలని సూచించగా అదే విధంగా చేశాడు. అంతే, కాసేపటి తర్వాత అతడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 3.94 లక్షలు వేరే అకౌంట్ కు ట్రాన్సఫర్ కావడంతో షాక్ తిన్నాడు. తాను మోసపోయానని అతడికి అర్థమైపోయింది. వెంటనే అశోక్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పేరుతో..
ఇదే తరహాలో మరో మోసం కూడా జరిగింది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ పేరుతో సైబర్ క్రిమినల్ అడ్డంగా దోచుకున్నాడు. సైఫాబాద్‌కు చెందిన శ్రీనివాసులు ఎస్‌బీఐ కార్డును వినియోగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ కార్డుకు ఇంటర్‌నెట్ బ్యాకింగ్ సదుపాయం లేదు, అది కావాలంటే కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటూ కార్డు వివరాలు తీసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో బ్యాంకు నుంచి కొత్త కార్డు వచ్చింది. ఎలాంటి ఓటీపీ రాకుండా కార్డును పిన్ నెంబర్‌తో యాక్టివేషన్ చేసేలోపే అతడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2.48 లక్షలు పోయాయి. తాను మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాసులు లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
సైబర్ క్రైమ్స్ గురించి పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. చైతన్యం కల్పిస్తున్నారు. అపరిచితుల నుంచి కాల్స్, మెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే బ్యాంకు వర్గాలను సంప్రదించాలని కోరుతున్నారు. అదే సమయంలో తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇన్ని హెచ్చరికలు చేస్తున్నా, జాగ్రత్తలు చెబుతున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు.