అర్ధరాత్రి ప్రియుడి దగ్గరకెళ్ళిన యువతి.. ప్రియుడితోపాటు మరో ముగ్గురు

ప్రియుడి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన 15 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు...మరో ముగ్గురు వేర్వేరుగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన చత్తీస్ ఘడ్ లో జరిగింది.

అర్ధరాత్రి ప్రియుడి దగ్గరకెళ్ళిన యువతి.. ప్రియుడితోపాటు మరో ముగ్గురు
ad

Gang Rape : ప్రియుడి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన  15 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు…మరో ముగ్గురు వేర్వేరుగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన స్వాతంత్ర్య దినోత్సవం రోజు చత్తీస్‌ఘడ్ లో చోటు చేసుకుంది.

చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని గాతాపార్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే 15 ఏళ్ళ యువతి తన ఫ్రియుడిని కలవటానికి   ఆగస్ట్ 15వ తేదీ రాత్రి  బయటకు వెళ్లింది. అక్కడి నుంచి వారిద్దరూ సమీపంలో ఉన్న నిర్మానుష్య  ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ   ప్రియుడు ఆమెపై అత్యాచారం చేశాడు.  ఆసమయంలో అటువైపుగా ఒక బైక్ రావటంతో ప్రియురాలిని వదిలివేసి ప్రియుడు పరారయ్యాడు.

దీంతో అక్కడి నుంచి యువతి ఒంటరిగా ఇంటికి తిరిగి వెళుతుండగా, మరో ముగ్గురు ఆమెను అటకాయించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాము అత్యాచారం చేసిన విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించారు.

తెల్లవారు ఝూమున 4-30 గంటల సమయానికి అతి కష్టం మీద ఇంటికి చేరుకున్న యువతిని ఏం జరిగిందని తల్లితండ్రులు ప్రశ్నించారు. ఇక్కడే యువతి తల్లితండ్రులకు ట్విస్ట్ ఇచ్చింది. తనపై   ప్రియుడు బలాత్కారం చేశాడని తెలిపింది. వెంటనే వారు కూతుర్ని తీసుకుని గాతాపార్ పోలీసు స్టేషన్‌కు  వెళ్లి ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మైనర్ కావటంతో అతడిని జువైనల్ హోం కు తరలించారు.

యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా.. రెండు రోజులు అనంతరం తనపై, దారిలో జరిగిన సామూహిక అత్యాచారాన్ని కూడా తల్లికి వివరించింది. ఈవిషయం పోలీసులకు తెలియడంతో వారు మరోక కేసు నమోదు చేసి యువతి వద్ద వాంగ్మూలం తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

కాగా మొదటి కేసులో యువతి  ప్రియుడు మైనర్ కావటంతో ఒక కేసు, గ్యాంగ్ రేప్ ఘటనలో పాల్గోన్న వారంతా పాతికేళ్ళు   పైబడినవారు కావటంతో వేరోక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గాతాపార్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. గ్యాంగ్ రేప్ కు పాల్పడిన డమర్ డీహ్ గ్రామానికి చెందిన కామేశ్వర్ వర్మ, కౌశల్ పటేల్, రాజేశ్ వర్మలలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.