Vijayawada Money lenders Harass : రూ.50వేలకు రూ.2లక్షలు చెల్లించినా వేధింపులు.. బెజవాడలో మళ్లీ వడ్డీ వ్యాపారుల అరాచకాలు

విజయవాడలో మళ్లీ పడగ విప్పుతున్న కాల్ మనీ కాల్ నాగులపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ముక్కు పిండి వసూలు చేస్తున్న వారి ఆట కట్టించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఓ కుటుంబాన్ని వేధించిన వడ్డీ వ్యాపారి ధన శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

Vijayawada Money lenders Harass : రూ.50వేలకు రూ.2లక్షలు చెల్లించినా వేధింపులు.. బెజవాడలో మళ్లీ వడ్డీ వ్యాపారుల అరాచకాలు

Vijayawada Money lenders Harass : విజయవాడలో మళ్లీ పడగ విప్పుతున్న కాల్ మనీ కాల్ నాగులపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ముక్కు పిండి వసూలు చేస్తున్న వారి ఆట కట్టించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఓ కుటుంబాన్ని వేధించిన వడ్డీ వ్యాపారి ధన శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

వాంబే కాలనీకి చెందిన ఫణికుమార్ కుటుంబం తమ షాపు నిర్వహణ కోసం ధన శేఖర్ నుంచి నాలుగేళ్ల క్రితం 50వేల రూపాయలు అప్పు తీసుకుంది. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. రెండు లక్షలు కట్టినా మరో లక్షల చెల్లిస్తేనే ప్రామిసరీ నోటు తిరిగిస్తానని ఫణికుమార్ కుటుంబాన్ని ధనశేఖర్ బెదిరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ధన శేఖర్ ను నున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

కాగా.. అవసరాల కోసం అప్పు తీసుకున్న ఎవరినైనా వడ్డీ వ్యాపారులు వేధిస్తుంటే పోలీసులకు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ కొల్లు శ్రీనివాసరావు చెప్పారు. బుసలు కొడుతున్న కాల్ మనీ కాల నాగులపై పోలీసులు నజర్ పెట్టారని ఆయన అన్నారు. అధిక వడ్డీల కోసం వేధిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురి చేస్తే బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. బాధితులకు తమ దృష్టికి తీసుకొస్తే వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు డీసీపీ కొల్లు శ్రీనివాసరావు.