ఒకే ఇంట్లో తల్లీకొడుకుల మృతి : తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆగిన కుమారుడి గుండె

ఒకే ఇంట్లో తల్లీకొడుకుల మృతి : తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆగిన కుమారుడి గుండె

ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుమారుడు మృతి చెందాడు.

ఒకే ఇంట్లో తల్లీకొడుకుల మృతి : తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆగిన కుమారుడి గుండె

ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుమారుడు మృతి చెందాడు.

యాదాద్రి భువనగిరి : భూదాన్‌ పోచంపల్లిలో విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుమారుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..పోచంపల్లికి చెందిన చెరిపల్లి లలిత (70) మార్చి 18 సోమవారం రాత్రి బీపీ ఎక్కువ కావడంతో బాత్‌రూంలో పడిపోయి మృతి చెందింది. హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆమె కుమారుడు సుందర్‌ (50) కు తల్లి మరణవార్త సమాచారాన్ని అందించారు.
Read Also :దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహానికి చేరుకున్న సుందర్‌ తల్లి మృతదేహాన్ని చూసి కాళ్లపై పడి బోరున ఏడ్చాడు. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోవడంతో చికిత్స కోసం అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో సుందర్ మృతి చెందారు. 

ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు భార్య, మరోవైపు పెద్ద కుమారుడు మృతి చెందడంతో వారి మృతదేహాలను చూస్తూ మృతురాలి భర్త చంద్రయ్య విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
Read Also :పనంటే ప్రాణం! : డ్యూటీకి వెళ్లొద్దన్న భార్యను చంపిన కానిస్టేబుల్

×