Demolition Drive: బుల్డోజర్‭తో ఇంటిని కూల్చుతుండగా ఇంట్లోనే అగ్నికి ఆహుతైన తల్లీకూతుళ్లు

ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇది యూపీలో రాజకీయంగా వివాదాస్పదమవుతోంది

Demolition Drive: బుల్డోజర్‭తో ఇంటిని కూల్చుతుండగా ఇంట్లోనే అగ్నికి ఆహుతైన తల్లీకూతుళ్లు

Mother-Daughter Die In Fire During Demolition Drive in UP

Demolition Drive: యోగి ప్రభుత్వం ‘బుల్డోజర్ కార్యక్రమం’ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై అధికారులు బుల్డోజర్ ఎక్కించి కూల్చడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాధారణమైంది. వాస్తవానికి బయటికి అక్రమాలపై బుల్డోజర్ అని చెబుతున్నప్పటికీ, రాజకీయ కక్ష సాధింపు కోసమే బుల్డోజర్ ఉపయోగిస్తున్నారనే విమర్శలు అనేకం ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఇల్లు, ఆస్తులు కోల్పోయిన రోడ్డున పడ్డవారు ఎందరో. వారికి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందడం లేదనే విమర్శలు సైతం అనేకం ఉన్నాయి.
Valentine’s Day: 40% ప్రేమతో బీజేపీకి ‘వాలెంటైన్స్ డే’ విషెస్ చెప్పిన కాంగ్రెస్

ఇక తాజాగా ఇదే బుల్డోజర్ కార్యక్రమంలో దు:ఖకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆక్రమణలు తొలగించే క్రమంలో రెండు నింపు ప్రాణాలు బలయ్యాయి. తమ ఇంటిని అధికారులు కూలుస్తుంటే తల్లీకూతుళ్లు ఇంట్లో నిప్పంటుకుని మరణించారు. రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం జరిగిన దారుణం ఇది. వాస్తవానికి లోపల నిప్పు రేగిన సంగతి అధికారులు గమనించలేదు. బుల్డోజర్ ఇంటిని కూల్చాక మంటలు బయటికి చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా అధికారులు ఖంగుతిన్నారు.

జిల్లా యంత్రాంగం బుల్డోజర్లతో వచ్చి ప్రభుత్వ భూమిలో ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. అలా ఒక గుడిసెను కూడా కూలుస్తుండగా ప్రమీలా దీక్షిత్ (45), ఆమె కూతురు నేహా దీక్షిత్ (20) ఇంట్లోనే మంటల్లో చిక్కుకున్నారు. అయితే వారిని గుడిసెలో ఉండగానే పోలీసులే తగలబెట్టారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు తామే నిప్పంటించుకుని ఆత్మహత్య చేుసకున్నారని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు. అభియోగాలు మోపిన వారిలో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బుల్డోజర్ ఆపరేటర్ ఉన్నారు. వారిపై హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా గాయపరిచడం కింద కూడా అభియోగాలు మోపారు.

ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇది యూపీలో రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. యోగి ప్రభుత్వం బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకుందని, వారిపై వరుస దాడులతో ప్రతీకార చర్యలకు దిగుతోందని సమాజ్‭వాదీ పార్టీ ఆరోపించింది. ఇక ఇదే విషయమై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి స్పందిస్తూ ‘పెద్దలకు పంచడం, పేదలను కూల్చడమే యోగి ప్రభుత్వ ఎజెండా’ అని విమర్శించారు.

Kiara Advani: ఆ ‘బ్లాక్ శారీ’లో మెరిసెందెవరు? సిద్ధార్థ్-కియారా బారాత్ వీడియోలో కనిపించిన మహిళ కోసం నెటిజెన్ల ఆరా