Rains In Telangana : వర్షాలకు కూలిన గోడ-తల్లీ, కూతురు మృతి

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Rains In Telangana : వర్షాలకు కూలిన గోడ-తల్లీ, కూతురు మృతి

Nalgonda Wall Collapse

Rains In Telangana :  నైరుతి   రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాలు తోడవటంతో నల్గోండ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్గోండ జిల్లాలో నిన్న సాయంత్రం ప్రారంభమైవ వాన ఇంకా కురుస్తూనే ఉంది.

వర్షాల కారణంగా నల్గొండ లోని పద్మానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళానికి జిల్లాకు చెందిన నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21) కాలనీలో నివసిస్తున్నారు. వీరు రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు.  రాత్రి నుంచి కురిస్తున్న వర్షానికి వీరు నివసిస్తున్న ఇంటి గోడ కూలి వీరి మీదపడటంతో ఇద్దరు అక్కడి కక్కడే మరణించారు.

శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన  ఈఘటనను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షాలకు గోడ నాని కూలిపోయినట్లు స్ధానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే కూతురు కళ్యాణికి వివాహం అయ్యిందని స్ధానికులు తెలిపారు.

Also Read : Telangana : పోలీసుల అదుపులో..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన మహిళ