Mother in law cuts head : బాబోయ్.. కోడలి తల నరికిన అత్త.. ఆ తల చేతిలో పట్టుకుని..

అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం భయానక ఘటన జరిగింది. ఓ అత్త తన కోడ‌లిని అత్యంత దారుణం చంపింది. కోడలి త‌ల న‌రికి హత్య చేసింది. ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది. త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భ‌యంగా నేరాన్ని ఒప్పుకుంది.

Mother in law cuts head : బాబోయ్.. కోడలి తల నరికిన అత్త.. ఆ తల చేతిలో పట్టుకుని..
ad

Mother in law cuts head : అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం భయానక ఘటన జరిగింది. ఓ అత్త తన కోడ‌లిని అత్యంత దారుణం చంపింది. కోడలి త‌ల న‌రికి హత్య చేసింది. ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది. త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భ‌యంగా నేరాన్ని ఒప్పుకుంది.

రాయ‌చోటి మండ‌లం కె.రామాపురానికి చెందిన సుబ్బ‌మ్మకు, కోడ‌లు వ‌సుంధ‌రతో(35) కొంత‌కాలంగా కుటుంబ క‌ల‌హాలు నడుస్తున్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన సుబ్బ‌మ్మ‌.. కోడ‌లు వ‌సుంధ‌ర‌పై దాడికి దిగింది. క‌త్తి తీసుకుని వ‌సుంధ‌ర త‌ల న‌రికేసింది.

Tamil Nadu : బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన చర్చి పాస్టర్

ఆ వెంటనే, తెగి ప‌డిన వ‌సుంధ‌ర త‌ల‌ను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లింది. త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశాన‌ని పోలీసుల‌కు చెప్పింది. కోడ‌లి త‌ల‌తో సుబ్బ‌మ్మ న‌డుచుకుంటూ వెళుతుండగా అది చూసిన జ‌నం బెంబేలెత్తిపోయారు. ఆ ఘోరాన్ని కళ్లారా చూసి వారు షాక్ తిన్నారు. అసలేం జరిగిందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు.

Killed live-in partner: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్‭నర్ గొంతు కోసిన మహిళ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బమ్మ తన కోడలు వసుంధరను ఇంటికి భోజనానికి పిలిచింది. అప్పటికే ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నింది. సుబ్బమ్మతో పాటు ఆమె సమీప బంధువులు కలిసి వసుంధరను దారుణంగా నరికి తలను వేరు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సుబ్బమ్మ కోడలి తల చేత పట్టుకొని సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి టౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆ దృశ్యం చూసిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. కుటుంబ కలహాలతో పాటు ఆస్తి గొడవలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.