Eluru : మిస్టరీ వీడింది, 14 రోజుల పసికందును తల్లే చంపేసింది!

14 రోజులకే ఆ పాపకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. మూడు రోజుల క్రితం పాప పాలు తాగట్లేదని ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కానీ డిశ్చార్జి చేసిన కాసేపటికి విగతజీవిగా కనిపించింది. అది కూడా ఆసుపత్రిలోని ఓ నీటి తొట్టెలో. ఈ విషాద ఘటన...ఏలూరులోని శంకరమఠంలో జరిగింది. అయితే..పసికందును ఎవరు చంపారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Eluru : మిస్టరీ వీడింది, 14 రోజుల పసికందును తల్లే చంపేసింది!

Eluru

Mother Kills 14 Day Old Baby : 14 రోజులకే ఆ పాపకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. మూడు రోజుల క్రితం పాప పాలు తాగట్లేదని ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కానీ డిశ్చార్జి చేసిన కాసేపటికి విగతజీవిగా కనిపించింది. అది కూడా ఆసుపత్రిలోని ఓ నీటి తొట్టెలో. ఈ విషాద ఘటన…ఏలూరులోని శంకరమఠంలో జరిగింది. అయితే..పసికందును ఎవరు చంపారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తల్లే చంపేసి..నీటి తొట్టేలో పడేసిందని పోలీసులు నిర్ధారించారు. కానీ..ఎందుకు చంపిందనేది తెలియరాలేదు.

Read More : The Conjuring: హర్రర్ సినిమాల పెద్దన్న ‘ది కాంజురింగ్’.. మూడో పార్ట్ రేపే విడుదల!

బావులపాడు మండలానికి చెందిన హరికృష్ణ, లక్ష్మి దంపతులు…తమ చిన్నారి పాలు తాగట్లేదని ఈ నెల 8న సాయి చిల్డ్రన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల డాక్టర్‌ సాంబశివరావు..ఆ పసికందును పరీక్షించి..ఈఎన్‌టీ డాక్టర దగ్గరకు పంపించారు. ఆ డాక్టర్ సూచించిన మందు వాడాక కోలుకుంది. దీంతో బుధవారం మధ్యాహ్నం పసికందును డిశ్చార్జి చేశామంటున్నారు సాయి చిల్డ్రన్స్ ఆసుపత్రి డాక్టర్. తర్వాత ఏం జరిగిందో తెలీదని, పోలీసులు వచ్చి చూస్తే పసికందు మృతదేహం కనిపించిందని, మధ్య సమయంలో ఆసుపత్రికి కొత్తగా వచ్చినవారెవ్వరూ లేరని అన్నారు.

Read More : Carrot Juice : పొట్ట కొవ్వు కరగాలంటే…. ఈ జ్యూస్ తాగటం బెటర్

ఆసుపత్రి వెనుక ఉన్న నీళ్ల తొట్టిలో పసికందు మృతదేహం కనిపించింది. తొలుత పాప కనిపించలేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఆసుపత్రి అంతా వెతికారు. అప్పటికే తల్లిదండ్రులు, బంధువులు, ఆసుపత్రి సిబ్బంది అంతా పసికందు కోసం వెతికారు. కానీ పోలీసులు అంతా వెతికి నీటితొట్టిలోకి తొంగి చూస్తే పసికందు మృతదేహం కనిపించింది. మనిషికన్నా ఎక్కువ ఎత్తు ఉండే నీటి తొట్టెలోకి పసికందు ఎలా పడిపోయింది? డెత్‌ మిస్టరీని చేధించే ప్రయత్నం చేశారు ఏలూరు పోలీసులు. చివరకు తల్లే చంపేసిందని నిర్ధారించారు. కానీ చంపడానికి గల కారణాలు తెలియరాలేదు.