First Rank Student Killed : పుదుచ్చేరి కారైక్కాల్‌లో దారుణం..కొడుకుకి సెకండ్‌ ర్యాంక్ రావడంతో ఫస్ట్ ర్యాంక్‌ స్టూడెంట్ హత్య

కన్న పిల్లల మీద ప్రేమ అందరి తల్లిదండ్రులకూ ఉంటుంది. కానీ.. ఆ ప్రేమ ప్రేమగానే ఉండాలి. ఆ ప్రేమే పిల్లలను సరైన దారిలో పెంచాలి. ఆ ప్రేమే.. వారి వృద్ధి కోరుకోవాలి. కానీ.. నా అనే ప్రేమ పక్క వారి పిల్లలపై అసూయగా మారింది. ఆ అసూయ ప్రాణాలు తీసేంత వరకు వెళ్లింది. తన కొడుకు కంటే మరొకరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడని ఓ బాలుడిని చంపిందా తల్లి.

First Rank Student Killed : పుదుచ్చేరి కారైక్కాల్‌లో దారుణం..కొడుకుకి సెకండ్‌ ర్యాంక్ రావడంతో ఫస్ట్ ర్యాంక్‌ స్టూడెంట్ హత్య

First Rank Student Killed

First Rank Student Killed : కన్న పిల్లల మీద ప్రేమ అందరి తల్లిదండ్రులకూ ఉంటుంది. కానీ.. ఆ ప్రేమ ప్రేమగానే ఉండాలి. ఆ ప్రేమే పిల్లలను సరైన దారిలో పెంచాలి. ఆ ప్రేమే.. వారి వృద్ధి కోరుకోవాలి. కానీ.. నా అనే ప్రేమ పక్క వారి పిల్లలపై అసూయగా మారింది. ఆ అసూయ ప్రాణాలు తీసేంత వరకు వెళ్లింది. తన కొడుకు కంటే మరొకరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడని ఓ బాలుడిని చంపిందా తల్లి. తన బిడ్డకు సెకండ్ ర్యాంక్‌ రావడం తట్టుకోలేక.. ఫస్ట్ ర్యాంక్‌ తెచ్చుకున్న బాలుడికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి ప్రాణాలు తీసింది. కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో జరిగిన ఈ ఘటన.. మానవత్వాన్ని.. తల్లి మనసునే ప్రశ్నిస్తోంది.

సౌతిండియా హీరో అజిత్‌ నటించిన విశ్వాసం మూవీలోని ఓ సీన్‌లాగే రియల్ లైఫ్‌లో రిపీటైంది. పుదుచ్చేరి కారైక్కాల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు మ‌ణికంద‌న్ ఎనిమిదో త‌ర‌గ‌తి చదువుతున్నాడు. శుక్రవారం అత‌డు హ‌ఠాత్తుగా సృహ త‌ప్పి ప‌డిపోయాడు. వెంట‌నే పాఠ‌శాల సిబ్బంది ఆస్పత్రికి త‌ర‌లించారు. అత‌డు విషం తాగిన‌ట్లు డాక్టర్లు తేల్చారు. సృహ‌లోకి వ‌చ్చిన తర్వాత పాఠ‌శాల సెక్యూరిటీ ఇచ్చిన శీత‌ల పానీయం తాగిన త‌ర్వాతే ఇలా జ‌రిగింద‌ని పేరెంట్స్‌కి చెప్పాడు. దీంతో పోలీసులను ఆశ్రయించారు మణికందన్ విద్యార్థి త‌ల్లిదండ్రులు.

Student Murder : పెద్దపల్లి జిల్లాలో ఘోరం.. డిగ్రీ విద్యార్థి దారుణ హత్య

పోలీసులు త‌మ‌దైన శైలిలో సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించ‌గా.. ఓ మ‌హిళ త‌న‌కు ఆ విద్యార్థికి కూల్‌డ్రింక్‌ ఇవ్వాలని చెప్పడంతోనే ఇచ్చిన‌ట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించి కూల్‌డ్రింక్‌ ఇచ్చిన విక్టోరియా అనే మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె చెప్పింది విని షాకయ్యారు. ఎప్పుడూ తన కుమారుడికి ఫస్ట్ క్లాస్ వచ్చేదని.. కానీ.. ఈ సారి మణికందన్‌కు ఫస్ట్ క్లాస్‌ రావడం తట్టుకోలేకే విషమిచ్చినట్లు తెలిపింది. దీంతో ఆమెను పోలీసులు కటకటాల్లోకి పంపగా.. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ మణికందన్‌ మరణించాడు.

అసూయ అనేది ఓ మానసిక వ్యాధి. మనతో పాటు ఇతరుల జీవితాలను నాశనం చేస్తుందనేది ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. మనం వృద్ధి చెందాలంటే.. ఒకరి అడ్డు తొలగించుకోకుండా.. ప్రయత్నించి వృద్ధి చెందితే.. అది శాశ్వతంగా నిలిచిపోతుంది. కానీ.. విక్టోరియా ఆలోచన లేకుండా చేసిన పని.. మణికందన్ పేరెంట్స్‌కి కడుపుకోత మిగల్చగా.. ఆమె కుమారుడికి దూరమైంది. సమాజంలో పెరిగిపోతున్న మార్కుల ధోరణి తల్లిదండ్రులను, విద్యార్థులను ఏ విధంగా మారుస్తున్నాయో మరోసారి తట్టి చూపింది ఈ ఘటన.