Mulugu Advocate Mallareddy Murder Case : సంచలనం రేపిన లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. మైనింగ్ మాఫియా కర్నూలు నుంచి ముఠాను దింపి మల్లారెడ్డిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Mulugu Advocate Mallareddy Murder Case : సంచలనం రేపిన లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ

Mulugu Advocate Mallareddy Murder Case : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. మైనింగ్ మాఫియా కర్నూలు నుంచి ముఠాను దింపి మల్లారెడ్డిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రధాన నిందితులు గోనెల రవీందర్, పిండి రవి యాదవ్, వంచ రామ్మోహన్ రెడ్డి, తడక రమేశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. హైకోర్టు జోక్యంతో కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు వందమందికిపైగా విచారించారు. ప్రతీ ఆధారాన్ని, వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేశారు.

Girl Rape Case : బాలిక రేప్‌ కేసులో ముగ్గురికి ప‌దేళ్ల జైలు శిక్ష‌, రూ.31వేలు జ‌రిమానా

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, ములుగు మండలానికి చెందిన రామ్మోహన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధి పిండి రవి యాదవ్, రైస్ మిల్లు ఓనర్ గోనెల రవీందర్, మాజీ విలేకరి రమేశ్ లను పోలీసులు ప్రధాన నిందితులుగా చేర్చారు ములుగు పోలీసులు. ప్రత్యక్షంగా పరోక్షంగా 15మంది లాయర్ మర్డర్ లో ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు తేల్చారు.

Taiwan :ప్రియుడిపై కోపంతో భవనానికి నిప్పు-46మంది మృతి-మహిళకు జీవిత ఖైదు

ఏడాది క్రితమే అడ్వొకేట్ మల్లారెడ్డి మర్డర్ కి నర్సంపేటలో నిందితులు స్కెచ్ వేశారు. మల్లారెడ్డిని హత్య చేసేందుకు నల్లబెల్లి మాజీ విలేకరి రమేశ్, నర్సంపేటకు చెందిన రైస్ మిల్లు వ్యాపారి రవీందర్ రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా మూడు లక్షలు ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే అనుచరుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధి పిండి రవి యాదవ్ మర్డర్ ప్లాన్ లో భాగస్వామ్యం అయ్యారు. వీరంతా కలిసి న్యాయవాది హత్యకు 44 క్వారీలకు చెందిన మైనింగ్ వ్యాపారుల నుంచి రూ.20లక్షల వరకు నిధులు సమీకరించారు. ఏపీకి చెందిన హంతక ముఠాకు సుపారీ ఇచ్చారు. ములుగు జిల్లా పందికుంట స్టేజి దగ్గర అడ్వొకేట్ మల్లారెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.