Mumbai : మహిళతో శృంగారం చేస్తుండగా వృధ్దుడు మృతి

తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృధ్ధుడు కన్ను మూసిన విషాద సంఘటన ముంబై లో వెలుగు చూసింది. 

Mumbai : మహిళతో శృంగారం చేస్తుండగా వృధ్దుడు మృతి

Mumbai Old Man

Mumbai :  తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృధ్ధుడు కన్ను మూసిన విషాద సంఘటన ముంబై లో వెలుగు చూసింది.  సోమవారం ఉదయం 10 గంటల సమయంలో  ఓ వృధ్ధుడు(61) సబర్బన్ కుర్లాలోని ఒక హోటల్ కు తన ప్రియురాలి (40)తో కలిసి వెళ్లాడు. హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. ఆ మహిళను తన ప్రియురాలిగా పేర్కోన్నాడు.

వాళ్లిద్దరూ హోటల్ రూం లోకి వెళ్లిన కొంత సమయానికి ఆ మహిళ రిసెప్షన్ కు ఫోన్ చేసి…. వృధ్ధుడు స్పృహ తప్పి పడిపోయాడని… అతనిలో ఎలాంటి చలనం లేదని చెప్పింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్ కు వచ్చిన పోలీసులు వృధ్దుడిని సియోన్ లోని ఆస్పత్రికి తరలించారు.  వృధ్దుడిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

పోలీసులు అతని ప్రియురాలిని పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించారు. ఆ వృధ్దుడు వర్లీలో ఉంటాడని, ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడని మహిళ వివరించింది. సన్నిహితంగా మెలిగే సమయంలో మద్యం తాగటానికి ప్రయత్నించాడని… అప్పుడు స్పృహ తప్పి పడిపోయాడని చెప్పింది.

మహిళ అందించిన ప్రాధమిక సమాచారం మేరకు యాక్సిడెంటల్ డెత్ రిపోర్టుగా  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చే్స్తున్నారు. వృధ్దుడి మరణానికి సరైన కారణాలు తెలియనప్పటికీ   లైంగిక చర్యలో పాల్గోనడానికి ముందు అతను ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకున్నాడా అనే  విషయం  నిర్ధారించుకోవటం కోసం పోస్టుమార్టం రిపోర్టు కోసం చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.