Mumbai: ఎయిర్‭పోర్టులో రూ. 34 కోట్ల హెరాయిన్ పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 34 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వస్తున్న ఒక వ్యక్తి తన సూట్ కేసులో ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ తీసుకొస్తూ ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కిపోయాడు.

Mumbai: ఎయిర్‭పోర్టులో రూ. 34 కోట్ల హెరాయిన్ పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

Mumbai Airport arrested a foreign passenger with 5 kilos of heroin

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 34 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వస్తున్న ఒక వ్యక్తి తన సూట్ కేసులో ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ తీసుకొస్తూ ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కిపోయాడు.

కాగా, పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. గుజరాత్ సముద్ర తీరంలో తాజాగా భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‭ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ మధ్యే స్వాధీనం చేసుకున్నాయి. రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థానీ ఓడ ‘అల్ హజ్‌’ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ రాష్ట్ర తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో తొమ్మిది మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ ఓడను పట్టుకుని, అందులో ఉన్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.

Congress President Poll: ఖర్గేను ఎన్నుకుంటే అంతగా ఉపయోగం ఉండదు.. థరూర్ సంచలన వ్యాఖ్యలు