Blackmailed By A Woman: ఫేస్‌బుక్‌లో మహిళ అసభ్య వీడియో కాల్.. తర్వాత ఏడున్నర లక్షలు కావాలంటూ బ్లాక్‌మెయిల్

ఒక అపరిచితుడికి అసభ్య వీడియో కాల్ చేసిందో మహిళ. తర్వాత ఆ వీడియో కాల్, చాట్ వివరాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Blackmailed By A Woman: ఫేస్‌బుక్‌లో మహిళ అసభ్య వీడియో కాల్.. తర్వాత ఏడున్నర లక్షలు కావాలంటూ బ్లాక్‌మెయిల్

Blackmailed By A Woman: ఆన్‌లైన్, సైబర్ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. కొత్తకొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాయి కొన్ని ముఠాలు. తాజాగా మరో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. ముంబైకు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి గత నెల 13న అంకిత శర్మ అనే మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతడు ఈ ప్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత అతడికి ఆమె అసభ్య వీడియో కాల్ చేసింది.

Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

కాస్సేపటికి అతడు ఆ కాల్ డిస్కనెక్ట్ చేశాడు. ఈ సారి అతడికి వాట్సాప్‌లో కాల్ చేసి, మళ్లీ అలాగే చేసింది. తర్వాత ఈ కాల్ కూడా అతడు డిస్కనెక్ట్ చేశాడు. నంబర్ బ్లాక్ చేశాడు. మరుసటి రోజు అతడికి ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతడికి, మహిళకు మధ్య జరిగిన చాట్, వీడియో కాల్స్ బయటపెట్టకూడదు అనుకుంటే రూ.15 వేలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో అతడు రూ.15 వేలు పంపించాడు. తర్వాత మరో నాలుగు రోజులకు అరుణ్ సక్సేనా అనే వ్యక్తి కాల్ చేశాడు. తాను ఢిల్లీలోని సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఆఫీసర్‌గా పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య వీడియో కాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, తాను సూచించిన నెంబర్‌కు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయమని అడిగాడు. దీంతో అరుణ్ సక్సేనా ఇచ్చిన నెంబర్‌కు కాల్ చేసి, వీడియో డిలీట్ చేయమని అడిగాడు. అలా చేయాలంటే రెండున్నర లక్షలు కావాలని అతడు డిమాండ్ చేశాడు.

India To Sell Fighter Jets: మలేసియాకు యుద్ధ విమానాలు విక్రయించనున్న భారత్

తర్వాత కొద్ది రోజులకు అరుణ్ సక్సేనా మళ్లీ ఫోన్ చేశాడు. అతడికి వీడియో కాల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా పంపాడు. ఆమె కుటుంబ సభ్యులు వీడియోలో ఉన్నందుకు తనఫై ఫిర్యాదు చేశారని కూడా పేర్కొన్నాడు. ఎఫ్ఐఆర్‌లోంచి అతడి పేరు తొలగించాలంటే మరో రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో విసుగెత్తిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.