అశ్లీల చిత్రాలు చిత్రీకరిస్తున్న ఫిల్మ్ యూనిట్ అరెస్ట్

అశ్లీల చిత్రాలు చిత్రీకరిస్తున్న ఫిల్మ్ యూనిట్ అరెస్ట్

Mumbai police busted adult movies making racket : టీవీ సీరియల్స్, సినిమాలు, ఓటీటీ సిరీస్ లో అవకాశం కల్పిస్తామని ఆశలు కల్పించి కొంత మంది ఔత్సాహిక నటీ నటులతో పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తున్న యూనిట్ ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో పోర్న్ వీడియోను చిత్రీకరిస్తున్నది మహిళా ఫోటోగ్రాఫర్ కావటం విశేషం.

ముంబై, మలద్ లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తున్నారని శుక్రవారం ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. బంగ్లాపై రైడ్ చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు నటులు, ఓ లైట్ మ్యాన్, మహిళా ఫోటోగ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్ వీరిలో ఉన్నారు. వీరివద్ద నుంచి రూ.5లక్షలు విలువ చేసే 6 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.

జౌత్సాహిక నటీనటులు, మోడల్స్ కు అవకాశం కల్పిస్తామనిచెప్పి ముఠా ఈ రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులు తెలిపారు. షరతులేమీ చెప్పకుండా వారితో ఎగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుని ఇలాంటి చిత్రాల్లో నటించేలా చేస్తారు. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి, వీడియోలు అమ్ముకుని ఈ ముఠా గత 2 ఏళ్లలో 37 లక్షలు సంపాదించారని ఇన్స్పెక్టర్ కేదారి పవార్ తెలిపారు.