అమ్మాయిలు కనిపిస్తే.. వెనుక నుంచి వచ్చి గట్టిగా..

  • Published By: sreehari ,Published On : February 7, 2020 / 05:09 AM IST
అమ్మాయిలు కనిపిస్తే.. వెనుక నుంచి వచ్చి గట్టిగా..

ఇతడో కామాంధుడు.. అమ్మాయిలు కనిపిస్తే చాలు వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టేసుకుంటాడు.. ముద్దులు పెట్టేస్తాడు. బెదిరిపోయిన వాళ్లు గట్టిగా అరవగానే అక్కడి నుంచి వెంటనే జారుకుంటాడు. కొన్నాళ్ల నుంచి ప్రతిరోజు అతడికి ఇదే పాడు పని. రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జిపై ఒంటరిగా మహిళలు తారసపడితే చాలు.. తనలోని మానవ మృగం బయటకు వస్తుంది. వెంటనే వెనుక నుంచి వచ్చి మహిళలపై అమాంతం పడిపోతుంటాడు. అమ్మాయిలను వేధిస్తున్న ఈ యువకుడి ఆగడాలు చూడలేక రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలే పోలీసులకు పట్టించాయి. ముంబైలోని మాతుంగాలో రైల్వే ఓవర్ బ్రిడ్జీపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ ఆధారంగా ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడి పేరు హబిబుర్ ఖాన్. ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌జూర్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. రైల్వే బ్రిడ్జీపై నుంచి ఒంటరిగా అమ్మాయిలు వెళ్లే సమయంలో వారిని వెనుక నుంచి గట్టిగా పట్టేసుకుని ముద్దులు పెట్టడం చేస్తుంటాడు. తాకరాని చోట చేతులు వేసి తాకుతూ లైంగికంగా మహిళలను వేధిస్తుంటాడు. బాధితులు తెరుకునేలోపే అక్కడి నుంచి పరారైపోతున్నాడు. పోలీసులకు చిక్కకుండా మహిళలను లైంగికంగా వేధిస్తున్న నిందితుడిని ఎట్టకేలకు సీసీ కెమెరాలు పట్టించాయి. 

హబిబుర్ ఖాన్ పై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. నిందితుడిపై లైంగిక వేధింపుల కింద ఇప్పటివరకూ ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. బాధితుల్లో ఎవరైనా మహిళలు వచ్చి హబిబూర్ ఖాన్ పై ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. జనవరి 26న ఓ మహిళ లైంగిక వేధింపులపై మాలద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇతగాడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు అధికారికంగా కేసును నమోదు చేయలేదు. రైల్వే స్టేషన్లోని అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత పోలీసులు మఫ్కీలో అక్కడికి వెళ్లి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు.