Mumbai : సినిమా చాన్స్‌ల పేరుతో నటి, మోడల్‌పై అత్యాచారం-షేర్ బ్రోకర్ అరెస్ట్

బాలీవుడ్ నిర్మాతలతో తనకు పరిచయాలు ఉన్నాయని ఆ పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఒక షేర్ బ్రోకర్ వర్ధమాన నటి, మోడల్ పై అత్యాచారం చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

Mumbai : సినిమా చాన్స్‌ల పేరుతో నటి, మోడల్‌పై  అత్యాచారం-షేర్ బ్రోకర్ అరెస్ట్
ad

Mumbai : బాలీవుడ్ నిర్మాతలతో తనకు పరిచయాలు ఉన్నాయని ఆ పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఒక షేర్ బ్రోకర్ వర్ధమాన నటి, మోడల్ పై అత్యాచారం చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.  ముంబై‌లో షేర్ మార్కెట్  ట్రేడర్ జిగ్నేష్ మెహతాకు ఒక వర్ధమాన నటి, మోడల్‌తో పరిచయం ఏర్పిడింది.

తనకు బాలీవుడ్‌లో తెలిసిన నిర్మాతలు ఉన్నారని వారి  ద్వారా నీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఆమెకు నమ్మబలికాడు. ఈ క్రమంలో ఆగస్ట్ 5న తనతో డిన్నర్‌కు రావాలని ఆమెను  కోరాడు. అందుకు అంగీకరించిన సదరు నటీమణి మెహతా చెప్పిన అంథేరిలోని హోటల్ కు వెళ్లింది.

అక్కడ మెహతా అతని స్నేహితుడితో కలిసి మోడల్ పై అత్యాచార యత్నం చేయబోయారు. ఈ క్రమంలో ఆమె వారిని ప్రతిఘటిస్తూ సహాయం కోసం బిగ్గరగా అరిచింది. ఆమె అరుపులు విన్నహోటల్  సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు. మెహతాను, అతని స్నేహితుడిని  పట్టుకున్న హోటల్ సిబ్బంది వారిని అంథేరి ఎంఐడీసీ పోలీసులకు అప్పగించారు. మెహతా, అతని స్నేహితుడిపై  ఐపీసీ సెక్షన్ 354, 354బీ, 506 సెక్షన్ల కింద కేసు  నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.