అప్పు తీర్చేందుకు సొంత ఇంటికే కన్నం వేసిన ఇల్లాలు

  • Published By: murthy ,Published On : June 22, 2020 / 08:04 AM IST
అప్పు తీర్చేందుకు సొంత ఇంటికే కన్నం వేసిన ఇల్లాలు

భర్తకు తెలియకుండా చేసిన అప్పులు తీర్చలేక ఆ ఇల్లాలు సొంత ఇంటికే కన్నం వేసింది. నవీ ముంబైలోని కోపర్ ఖైరన్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళ తన భర్తకు తెలియకుండా  అప్పులు చేసింది. వాటికి వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోవటం అప్పులు భారం కావటంతో అప్పు తీర్చేందుక కొత్త ఎత్తులు వేసింది.  తన ఇంటినే దోచుకుంది. రూ.4లక్షలు రుణంచెల్లించేందుకు ఇంట్లోని రూ.11.1 లక్ష విలువగల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు దొంగిలించింది. 

జూన్ 5న తనకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లమని భర్తను కోరింది ఆ మహిళ. భర్త ఆమెను ఘన్సోలిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె తనకు ఓపికలేదని ఆ రాత్రి  తనను పుట్టింటి వద్ద దింపమని కోరింది.  భర్త ఆమెను పుట్టింటి వద్ద దింపి తన ఇంటికి వచ్చేశాడు. తిరిగి 17వ తేదీ మధ్యాహ్నం 2-30 గంటల సమయంలో మళ్లీ ఆ వ్యక్తి తన భార్యను మామగారి ఇంటివద్ద నుంచి ఆస్పత్రి వద్ద దింపి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. 

రాత్రికి ఇంటికి వస్తానని భార్య చెప్పటంతో సాయంత్రం ఆఫీసు అయ్యాక రాత్రి గం.7-30 సమయంలో భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించగానే వారి ఇల్లు దోపిడీకి గురైనట్లు గుర్తించారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. బీరువాలో పెట్టిన నగదు కూడా కనిపించలేదు. దొంగ కిటీకీలోంచి లోపలకు వచ్చి దొంగతనం చేసినట్లుగా గుర్తించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయటం ప్రారంభించారు. ఇంటి చుట్టుపక్కల వారిని విచారించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు బాధితుడి భార్యనుంచి వాంగ్మూలం తీసుకోటానికి ప్రయత్నించారు. ఆమె ఇచ్చిన  వాంగ్మూలంలో సందేహాలు తలెత్తటంతో  పోలీసులు ఆమెను మరింతగా ప్రశ్నించారు. పోలీసు విచారణలో ఆమె….  అప్పుతీర్చటానికి తానే దొంగతనం చేశానని చేసిన  తప్పును ఒప్పుకుంది. తనభర్త ఉద్యోగానికి వెళ్లినప్పుడు ఇంటికి వచ్చి దొంగతనం చేశానని అంగీకరించింది. కాగా..భర్త తన ఫిర్యాదును ఉపసంహరిచుకున్నాడు.

Read: ఐఆర్ఎస్ అధికారి రాసలీలలు….రెండేళ్లుగా మహిళతో ఎఫైర్