Hyderabad : భార్య పై అనుమానం-మిత్రుడితో రూ.7 లక్షల సుపారీతో హత్యాయత్నం

భార్యపై  అనుమానంతో మిత్రుడికి సుపారీ ఇచ్చి హత్యచేయించేందుకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Hyderabad : భార్య పై అనుమానం-మిత్రుడితో రూ.7 లక్షల సుపారీతో హత్యాయత్నం

Murder Attempt

Hyderabad : భార్యపై  అనుమానంతో మిత్రుడికి సుపారీ ఇచ్చి హత్యచేయించేందుకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.  హైదరాబాద్ సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేశ్వరీనగర్‌కు చెందిన స్పందన (26), వేణుగోపాల్‌ భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర కుమార్తె  ఉంది.

వేణు గోపాల్ కు భార్య   స్పందన వ్యవహార శైలిపై అనుమానం వచ్చింది. ఆమె తరచూగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. దీంతో ఆమెకు వేరోక వ్యక్తితో  సంబంధం ఉందనే అనుమానం రానురాను బలపడసాగింది.  దీంతో తన మిత్రుడు, జూనియర్ ఆర్టిస్ట్ యూసఫ్ గూడలో ఉండే తిరుపతితో బేరం కుదుర్చుకున్నాడు.

తన భార్యను హత్య చేస్తే రూ.7 లక్షల రూపాయలు ఇస్తానని కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.  గతేడాది ఓసారి వేణుగోపాల్‌   స్వగ్రామమైన   చేగుంటలో స్పందనను హత్య చేసేందుకు   యత్నించి విఫలమయ్యాడు. ఈసారి  ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని… తాను ఇంట్లో ఉండగానే హత్య జరిగితే   అనుమానం రాదని గ్రహించి   గత  నెల 30న హత్య చేసేందుకు పూనుకున్నారు.

గత నెల 30న వేణు గోపాల్, తిరుపతిలు మర్డర్ ప్లాన్ అమలు చేసేందుకు పూనుకున్నారు. అర్ధరాత్రి సమయంలో   ఏడాదిన్నర కుమార్తెను తీసుకుని వేణుగోపాల్ వరండాలోకి  తీసుకువెళ్లిన సమయంలో తిరుపతి  ఇంట్లో ప్రవేశించి స్పందనపై కత్తితో  గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించాడు. అది కాస్తా విఫలం  అయ్యింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  ఈ క్రమంలో ఆమె గతేడాది  తనపై జరిగిన హత్యాయత్నాన్ని కూడా పోలీసులుకు వివరించింది.  దీంతో పోలీసులు అప్పుడు ఉపయోగించిన బైక్ నెంబర్  ఆధారంగానూ… గతనెల 30 న జరిగిన హత్యాయత్నంలో   సీసీటీవీ ఫుటేజీలు ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితుడు తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Child Killed : హైదరాబాద్ లో విషాదం.. గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి
పోలీసులు తమ దైన స్టైల్లో విచారించే సరికి తిరుుపతి నిజం ఒప్పుకున్నాడు. స్పందనను హత్యచేయమని పురమాయించింది వేణుగోపాలే అని చెప్పటంతో అతడిని కూడా అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు.