Blade Batch In Hyderabad : వామ్మో.. 100 రూపాయల కోసం హత్యలు.. హైదరాబాద్‌కు పాకిన బెజవాడ క్రైమ్ కల్చర్

చిల్లర డబ్బు కోసం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారే టార్గెట్ గా మర్డర్స్ చేస్తున్నాయి. ఏపీ, కర్నాటక నుంచి నగరానికి వచ్చి చిత్తు కాగితాలు ఏరుకునే కొందరు ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల దర్యాఫ్తులో తేలింది. జేబులో 200 రూపాయలు, 500 రూపాయలు కనిపిస్తే చాలు హత్యలు చేసేందుకు వెనుకాడటం లేదు ఈ బ్లేడ్ బ్యాచ్. (Blade Batch In Hyderabad)

Blade Batch In Hyderabad : వామ్మో.. 100 రూపాయల కోసం హత్యలు.. హైదరాబాద్‌కు పాకిన బెజవాడ క్రైమ్ కల్చర్

Blade Batch

Blade Batch In Hyderabad : బ్లేడ్ బ్యాచ్.. ఈ పేరు ఎక్కువగా విజయవాడలో వినిపిస్తూ ఉంటుంది. నేరాలు, ఘోరాలు చేయడమే ఈ ముఠాల పని. డబ్బు కోసం ఎంతకైనా బరితెగిస్తారు. వంద రెండు వందల రూపాయలు దొరికినా చాలనుకుని హత్యలు కూడా చేసే కిరాతక ముఠాలే బ్లేడ్ బ్యాచ్ లు. ఆ తర్వాత ఈ క్రైమ్ కల్చర్ గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నానికి విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా బ్లేడ్ బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి.

చిల్లర డబ్బు కోసం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారే టార్గెట్ గా మర్డర్స్ చేస్తున్నాయి. ఏపీ, కర్నాటక నుంచి నగరానికి వచ్చి చిత్తు కాగితాలు ఏరుకునే కొందరు ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల దర్యాఫ్తులో తేలింది. ఈ తరహా కేసులు పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. జేబులో 200 రూపాయలు, 500 రూపాయలు కనిపిస్తే చాలు హత్యలు చేసేందుకు వెనుకాడటం లేదు ఈ బ్లేడ్ బ్యాచ్. డబ్బు కోసం ఈ ముఠాలు ఎంతకైనా తెగిస్తాయి. చిల్లర డబ్బు కోసం గొంతులు కోసేయడానికైనా వెనుకాడటం లేదు.

DGP Rajendranath Reddy : ఆధార్‌ డేటా, ఫింగర్‌ ప్రింట్స్‌ ఎవరికి ఇవ్వొద్దు: డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి

ఇటీవల ఫుట్ పాత్ లపై నాలుగు మర్డర్స్ జరిగాయి. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి చేతిలో 500 రూపాయల నోటు కనిపించడంతో బ్లేడ్ బ్యాచ్ అతడిని టార్గెట్ చేసింది. అతడి కదలికలను గమనించింది. ఎలాగైనా డబ్బు కాజేయాలనుకుంది. మూకుమ్మడిగా దాడి చేసిన బ్లేడ్ బ్యాచ్ హత్య చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జూలై 23న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మర్డర్ జరిగింది. టెలిఫోన్ భవన్ బస్టాప్ లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి గొంతుకోసి అతడి దగ్గరున్న డబ్బును తీసుకుపోయారు. ఆ సొమ్ము ఎంతో కాదు కేవలం 160 రూపాయలు మాత్రమే. గొంతు కోసేయడంతో ఆ వ్యక్తి మరణించాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు స్పెషల్ టీమ్ తో గాలించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కర్నాటక గుల్బర్గాకు చెందిన అనిల్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన మహేశ్ లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.2వేల నగదు, ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి నేరాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది.

Extra Marital Affair : సచివాలయ ఉద్యోగి రాసలీలలు-రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టుగూడ మెట్రోస్టేషన్ సమీపంలో మరో హత్య జరిగింది. వైట్నర్ మత్తులో దుండగులు ఓ వ్యక్తి గొంతుకోసి చంపేశారు. డబ్బు కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే గంజాయి మత్తులో డబ్బు కోసం చాదర్ ఘాట్, మలక్ పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో హత్య ప్రయత్నం ఘటనలు చోటు చేసుకున్నాయి. జల్సాలకు అలవాటు పడిన కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారే టార్గెట్ గా మర్డర్లు పెరగడంతో పోలీసులు నిఘా పెంచారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ బ్లేడ్ బ్యాచ్ ముఠాలు నలుగురిని హత్య చేశాయి. చిలకలగూడ, సైఫాబాద్, లాలాగూడ, మలక్ పేటలో మర్డర్లు జరిగాయి. ఏపీలోని తెనాలి నుంచి వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుల్బర్గ, జహీరాబాద్ కు చెందిన మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.