Teacher Asked Remove Hijab : హిజాబ్‌ తీసేసి పరీక్ష రాయాలన్న ఉపాధ్యాయుడు.. ముస్లిం విద్యార్థినులు ఆందోళన

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్‌పూర్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్‌ సెంట్‌-అప్‌ ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. హిజాబ్ తీసేసి పరీక్ష రాయాలని విద్యార్థినులను ఉపాధ్యాయుడు కోరారు. హెడ్‌ స్కార్వ్‌ తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తానని చెప్పారు.

Teacher Asked Remove Hijab : హిజాబ్‌ తీసేసి పరీక్ష రాయాలన్న ఉపాధ్యాయుడు.. ముస్లిం విద్యార్థినులు ఆందోళన

Teacher Asked Remove Hijab

Teacher Asked Remove Hijab  : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్‌పూర్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్‌ సెంట్‌-అప్‌ ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. హిజాబ్ తీసేసి పరీక్ష రాయాలని విద్యార్థినులను ఉపాధ్యాయుడు కోరారు. హెడ్‌ స్కార్వ్‌ తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తానని చెప్పారు. దానికి విద్యార్థినులు నిరాకరించారు. తమ పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసుల జోక్యంతో శాంతించిన విద్యార్థినులు.. ఆందోళన విరమించి పరీక్ష రాసి వెళ్లిపోయారు.

ముజఫర్‌పూర్‌లోని మహంత్ దర్షన్‌ దాస్‌ మహిళా కాలేజీలో ఆదివారం ఇంటర్మీడియట్‌ సెంట్‌ అప్‌ పరీక్షలు నిర్వహించారు. కొంతమంది ముస్లిం విద్యార్థినులు పరీక్ష రాసేందుకు వచ్చారు. అయితే తరగతి వద్ద రవి భూషణ్‌ అనే ఉపాధ్యాయుడు.. బ్లూటూత్‌ వంటి పరికరాలు ఉంటాయనే అనుమానంతో వారిని హిజాబ్‌ తీసేయాలని కోరాడు. దీనికి వారు తిరస్కరించారు. ఎవరైనా మహిళా ఉద్యోగులు ఉంటే.. వారితో తమను తనిఖీ చేయించాలన్నారు. ఈ సందర్భంగా  ఎవరివద్దనైనా బ్లూటూత్‌ దొరికితే వారిని పరీక్ష రాయడానికి అనుమతించవద్దని తెలిపారు.

Hijab ban case in India: హిజాబ్ వివాదం… ఎలా మొదలైంది?.. ఏ రోజు ఏం జరిగింది?

అయితే హెడ్‌ స్కార్వ్‌ తీసేస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తానని సదరు ఉపాధ్యాయుడు చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పట్ల ఉపాధ్యాయుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇక్కడ ఉంటున్న మీరు.. అక్కడి పాట పాడుతారని, పాకిస్థాన్‌ వెళ్లిపోవాలన్నాడని ఆరోపిస్తూ కాలేజీ ఎందుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని వారిని శాంతిపజేశారు.

విద్యార్థినులు పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. ఈ వివాదంపై కాలేజీ ప్రిన్సిపాల్‌ స్పందించారు. ఆందోళనతో కాలేజీలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్లు, బ్లూ టూత్‌ వంటి పరికరాలు అమర్చుకునే అవకాశం ఉండటంతోనే హెడ్‌ స్కార్వ్‌ తొలగించాలని తమ సిబ్బంది కోరారని తెలిపారు. దానిని వారు మతానికి ముడిపెట్టి విషయాన్ని వివాదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.