విద్యార్ధినితో మాస్టారు కామక్రీడలు : వాట్సప్ లో ఫోటోలు వైరల్

  • Published By: chvmurthy ,Published On : March 3, 2020 / 06:18 PM IST
విద్యార్ధినితో మాస్టారు కామక్రీడలు : వాట్సప్ లో ఫోటోలు వైరల్

స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగాక నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగిపోతున్నాయి. వీటిని ఎక్కడ ఉపయోగించాలి…ఎక్కడ ఉపయోగించకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువుకున్న విద్యార్థినిని వంచించి ఆమెతో క్రామక్రీడలకు పాల్పడ్డాడు. 

ఆ సమయంలో  ఆమెను మాటలతో ఏమార్చి  వాటిని మొబైల్‌ఫోన్‌లో ఫోటోలు తీసాడు. అవి కాస్తా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో ఇప్పుడీ అంశం  మైసూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. కామ ఉపాధ్యాయుని నీచత్వంపై జనం ఛీ కొడుతున్నారు. 
 

మైసూరు జిల్లా నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ఈ దాష్టీకం చోటు చేసుకుంది.  రాంపుర గ్రామంలో ఉన్న  ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాడైన సిద్దరాజు అలియాస్‌ సిద్ధరామయ్యకు ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు అయ్యాయి. తన వద్ద చదువుకున్న పాత విద్యార్థిని (20)ని మభ్యపెట్టి తన వద్దకు పిలిపించుకుని తన కోరికలు తీర్చుకునేవాడు.

ఆ ఫోటోలు తీసి వాటిని యువతి వాట్సప్‌కు పంపించాడు.  ఎవరి దగ్గరనుంచి వెళ్ళాయో కానీ ఆ ఫోటోలు కాస్త వేరేవాళ్ల వాట్సప్ నెంబర్ కు వెళ్లి ఊరంతా తెలిసింది. దీంతో సోమవారం మార్చి 2న గ్రామం మొత్తం  ఉపాధ్యాయుడి కామ క్రీడల పోటోలు వైరల్‌గా మారాయి. 

ఈ ఘోరంపై గ్రామస్తులు ఆగ్రహంతో పాఠశాల ముందు ధర్నాకు దిగారు. సిద్దరాజు గ్రామం నుంచి పరారీ అయ్యాడు. అతడు గత కొంతకాలంగా ధనుర్వాతంతో బాధపడుతున్నప్పటికీ యువతిని తరచూ ఇంటికి రప్పించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న అతడిని అరెస్టు చేయాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాస్టారి కోసం గాలింపు చేపట్టారు.