ప్రియుడ్ని చంపేందుకు సుపారీతో పాటు, ఆ ఆఫర్ కూడా ఇచ్చిన యువతి

ప్రియుడ్ని చంపేందుకు సుపారీతో పాటు, ఆ ఆఫర్ కూడా ఇచ్చిన యువతి

Nagapur  young girl hires contract killer, by offering cash and sex to kill her lover, arrested : తను ప్రేమించిన వ్యక్తి తనను పెళ్లి చేసుకోటానికి నిరాకరించాడని,  20 ఏళ్ల యువతి ప్రియుడ్ని చంపటానికి సుపారీ ఇచ్చింది. ప్రియుడ్ని హత్య చేస్తే. లక్షా 50వేల రూపాయల నగదు తోపాటు పడక సుఖం కూడా ఇస్తానని చెప్పి ప్రియుడ్ని హత్య చేయించిన ఘటన నాగపూర్ లో చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని నాగపూర్ లో నివసించే 20 ఏళ్ల యువతి చందూమహాపూర్ అనే వివాహితుడ్ని ప్రేమించింది. అతడికి అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్నారు. అయినా యువతి అతడ్ని ఇష్టపడి ప్రేమ కొనసాగించింది. ఈ క్రమంలో   కొన్నాళ్లకు యువతి తనను పెళ్ళి చేసుకోమని ప్రియుడ్ని  కోరింది.

ఇప్పటికే పెళ్లైంది కనుక పెళ్ళి చేసుకోలేనని చందు తెలియచేశాడు. దీంతో ఆమెకు ప్రియుడిపై విపరీతమైన కోపం వచ్చింది. తనకు దక్కని  ప్రియుడి ఇంకోకరికి దక్కకూడదనే కసి పెరిగి పోయింది.  చందూను చంపటానికి ప్లాన్ వేసింది.

అందుకోసం చందూ స్నేహితుడిని, అతనితో  కొంతకాలంగా గొడవపడుతున్న భరత్ గుర్జార్ అనే వ్యక్తిని ఎంపిక చేసుకుంది. ఆ వ్యక్తితో డీల్ మాట్లాడుకుంది. చందును హత్యచేస్తే రూ.1.50 లక్షలతో పాటు తనతో సెక్స్ సుఖాన్ని అందిస్తానని హామీ ఇచ్చింది.

భరత్ గుర్జార్ కు, గతంలో  చందూ తో డబ్బుల విషయంలో తేడా వచ్చింది. భరత్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.  ఇప్పుడు యువతి రూపంలో అతనికి అవకాశం వచ్చిందని భావించాడు. ఇద్దరి మధ్య డీల్ ఓకే అయ్యింది. చందూను చంపేందుకు ప్లాన్  వేశాడు.

ఫ్రిబ్రవరి 25న  భరత్, చందు ను మందు పార్టీ చేసుకుందామని చెప్పి  సలైమంథలోని క్రషర్ వద్దకు తీసుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించిన తర్వాత భరత్, చందూను బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం ఇంకా బతికి ఉన్నాడేమో అనే అనుమావంతో గొంతు కోసి హత్య చేశాడు. శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయాడు.

అర్ధరాత్రి అయినా చందూ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఒక చోట చందూ భరత్ తో వెళ్ళటం సీసీటీవీ ఫుటేజిలో గమనించారు.  వెంటనే అనుమానితుడు భరత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

పోలీసు విచారణలో భరత్ అన్ని విషయాలు చెప్పాడు.  చందూ ను ఎక్కడ  హత్య చేశాడు. ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాలు…యువతి తో చందూ ప్రేమాయణం అన్ని పోలీసులకు వివరించాడు. హత్య వెనుక యువతి తల్లి తండ్రుల పాత్ర కూడా ఉందని తెలుసుకున్నపోలీసులు, హత్యకు ప్లాన్ చేసిన యువతిని, ఆమె తల్లి తండ్రులను కూడా అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.