Nagole Swimming Pool Case : నాగోల్ స్విమ్మింగ్ పూల్ కేసు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, లింగంపల్లిలో అంత్యక్రియలు

బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుండి లింగంపల్లికి తరలించారు. కుటుంబసభ్యులు లింగంపల్లిలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.

Nagole Swimming Pool Case : నాగోల్ స్విమ్మింగ్ పూల్ కేసు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, లింగంపల్లిలో అంత్యక్రియలు

Nagole Swimming Pool Case

Nagole Swimming Pool Case : నాగోల్ లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి చనిపోయిన పదేళ్ల బాలుడు మనోజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, మృతదేహాన్ని నాగోల్ లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ కు తరలించాలని కుటుంబ సభ్యులు భావించారు. ఇంతలో చైతన్యపురి పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు.

బాలుడి మృతదేహాన్ని లింగంపల్లికి తరలించి అంతక్రియలు నిర్వహించాలని పోలీసులు వారితో చెప్పారు. అయితే, అందుకు బాలుడి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదన్నారు.(Nagole Swimming Pool Case)

Swimming Pool Boy Died : నాగోల్ స్విమ్మింగ్ పూల్ బాలుడు మృతి కేసు.. అనుమతుల్లేవని తేల్చిన జీహెచ్ఎంసీ

రంగంలోకి దిగిన పోలీసులు.. స్వయంగా బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుండి లింగంపల్లికి తరలించారు. మనోజ్ కుటుంబసభ్యులు లింగంపల్లిలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. మరోవైపు స్విమ్మింగ్ పూల్ దగ్గర బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. స్విమ్మింగ్ పూల్ నుండి లింగంపల్లికి బయల్దేరారు. కాగా, ఇప్పటికే బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడు అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Blue Fab

Blue Fab

లింగంపల్లిలో నివాసం ఉండే పదేళ్ల బాలుడు మనోజ్.. వేసవి సెలవలు కావడంతో నాగోల్ లోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సమ్మర్ లో సరదాగా ఈత కొట్టాలని అనుకున్నాడు. ఆదివారం సాయంత్రం నాగోల్‌లోని సమతాపురి కాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్‌ పూల్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. అయితే, స్విమ్మింగ్ చేయాలనే సరదానే అతడి పాలిట శాపంగా మారింది. పదేళ్లకే నూరేళ్లు నిండాయి.

swimming pool: స్విమ్మింగ్‌పూల్‌లో బాలుడు మృతిపై తల్లిదండ్రుల ఆందోళన.. ఉద్రిక్తత

మనోజ్ స్విమ్మింగ్ పూల్ లోని నీటిలో మునిగి చనిపోయాడు. మనోజ్ మృతికి స్విమ్మింగ్ పూల్ నిర్వహకుల నిర్లక్ష్యమే కారణం అని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. దగ్గరుండి చూసుకోవాల్సిన ట్రైనర్ తన గదిలో రెస్ట్ తీసుకుంటున్నాడు. దీనికితోడు స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకులు కనీసం ట్యూబ్‌ కూడా ఇవ్వకపోవడంతో మనోజ్ నీటిలో మునిగి చనిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యారు. మనోజ్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్‌ పూల్ నిర్వాహకుల తీరుపై బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనోజ్ చావుకి కారణమైన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

Pool

Pool

బాలుడి మృతి ఘటన దుమారం రేపింది. వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ను GHMC అధికారులు సీజ్‌ చేశారు. స్విమ్మింగ్‌ పూల్‌ లో తనిఖీలు చేసిన అధికారులు ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బ్లూ ఫ్యాబ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర.. మృతుడు మనోజ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్విమ్మింగ్‌ పూల్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మనోజ్‌ మృతికి కారణమైన స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. ఏ ఒక్క రాజకీయ నాయకుడు, అధికారి ఇటు వైపు కన్నెత్తి చూడలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Pool (1)

Pool (1)