Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఏ కింద బెయిల్ మంజూరు చేసింది.

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

Raja Singh On PD Act

Raja Singh: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకుముందు ఇదే కేసుకు సంబంధించి విచారించిన కోర్టు, రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగింది.

Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య

అయన రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. రాజాసింగ్ లాయర్లు, ప్రభుత్వ లాయర్ల మధ్య బెయిల్ పిటిషన్‌పై దాదాపు 45 నిమిషాలపాటు వాదనలు జరిగాయి. రాజాసింగ్‌కు బెయిల్ ఇస్తే అల్లర్లు పెరుగుతాయని ప్రభుత్వ తరఫు లాయర్లు వాదించారు. అయితే, రాజాసింగ్‌పై నమోదు చేసిన కేసులన్నీ బెయిలబులే అని అతడి తరఫు లాయర్లు వాదించారు. రాజాసింగ్ ప్రజాప్రతినిధి అని, ఆయనకు 41 సీఆర్‌పీసీ సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన తరఫు లాయర్. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు రాజాసింగ్ విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత కొనసాగింది. రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు.. కోర్టు ఎదుట ఆందోళన చేపట్టాయి.

Zomato Delivery Partner: వేరే వాళ్ల ఆర్డర్ తీసుకుని మరీ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యువతి.. వీడియో వైరల్

కోర్టు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు చుట్టుపక్కల ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. కోర్టు పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.