Nampally Court : హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు

మంగళవారం నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే... మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన హోంగార్డ్ మల్లిఖార్జున్ కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.. దాంతో పాటు 40 వేల రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానా బాధిత కుటుంబానికి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

Nampally Court : హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు

Nampally Court

Nampally Court :  మంగళవారం నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే… మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన హోంగార్డ్ మల్లిఖార్జున్ కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.. దాంతో పాటు 40 వేల రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానా బాధిత కుటుంబానికి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ ఏడాదితో ఫిబ్రవరిలో తమ కూతురిపై హోంగార్డ్ మల్లికార్జున్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తుకారాంగేట్ కి చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను వైద్యపరీక్షలు చేయించారు.

రిపోర్ట్స్ లో బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. మెడికల్‌ రిపోర్ట్స్‌ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ వరకు అన్ని ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై ఈ రోజు (03-08-2021) విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం నిందితుడు మల్లికార్జున్ కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.