Damera Rakesh: రాకేష్ మృతికి నిరసనగా నేడు నర్సంపేట బంద్.. ఎంజీఎం చేరుకుంటున్న యువత

రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.

Damera Rakesh: రాకేష్ మృతికి నిరసనగా నేడు నర్సంపేట బంద్.. ఎంజీఎం చేరుకుంటున్న యువత

Damera Rakesh

Damera Rakesh: సికింద్రాబాద్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ మృతికి నిరసనగా నర్సంపేట నియోజకవర్గంలో నేడు స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆసుపత్రికి చేరుకోనున్నారు.

ED Raids: జేసీ సోదరుల ఇంట్లో ఈడీ తనిఖీలు పూర్తి

బంద్ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దుకాణ సముదాయాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేశారు. టీఆర్ఎస్ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ఆర్మీ అభ్యర్థుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం మార్చురీ నుంచి రాకేష్ స్వగ్రామమైన నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం దబ్బీర్ పేట వరకు భారీ ర్యాలీ జరగనుంది. దాదాపు 60 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ సాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భారీ ఎత్తున యువత ఎంజీఎంకు చేరుకుంటున్నారు.