Cop ‘spits’ on Dalit man: దళితుడి ముఖంపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించిన పోలీసు

దళితుడి ముఖంపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించాడు ఓ పోలీసు. దళితుడిని పోలీస్ స్టేషన్ లోనే తిడుతూ కించపర్చాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నేవీ ముంబైలో చోటుచేసుకుంది. దళితులకు అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వస్తారు. అటువంటిది పోలీస్ స్టేషన్ లోనే దళితుడి పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన సదరు పోలీసు దినేశ్ పాటిల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Cop ‘spits’ on Dalit man: దళితుడి ముఖంపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించిన పోలీసు

Cop ‘spits’ on Dalit man: దళితుడి ముఖంపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించాడు ఓ పోలీసు. దళితుడిని పోలీస్ స్టేషన్ లోనే తిడుతూ కించపర్చాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నేవీ ముంబైలో చోటుచేసుకుంది. దళితులకు అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వస్తారు. అటువంటిది పోలీస్ స్టేషన్ లోనే దళితుడి పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన సదరు పోలీసు దినేశ్ పాటిల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

దినేశ్ పాటిల్ పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితుడు వికాస్ ఉజ్గారె మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపాడు. ఇటీవల రాత్రి సమయంలో తాను, తన స్నేహితుడితో కలిసి ఓ చైనీస్ రెస్టారెంటు వద్ద ఉన్నానని, ఆ సమయంలో ఆ రెస్టారెంటు యజమానితో తమకు ఘర్షణ జరిగిందని అన్నాడు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని చెప్పాడు.

కలాంబొలీ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడకు పోలీసులు వచ్చారని తెలిపాడు. తనకు గాయాలు కావడంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు చెప్పానని, అందుకు పోలీసులు మొదట నిరాకరించారని చెప్పాడు. వారిని బతిమిలాడగా చివరకు ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని, అయితే, అక్కడి వైద్యులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారిన అన్నాడు.

అయితే, పోలీసులు తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని, నేలపై కూర్చోబెట్టారని తెలిపాడు. అనంతరం దినేశ్ పాటిల్ తన వద్దకు వచ్చి చెంపపై కొట్టాడని చెప్పాడు. అనంతరం తనపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించాడని తెలిపాడు. చివరకు తనను వదిలేశారని, తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని అన్నాడు.

Viral Pics: మహిళల దుస్తులు అమ్మే దుకాణాల్లో బొమ్మల ముఖాలు కనపడకుండా ఆంక్షలు