Celebrities : షాకింగ్.. 100 మంది సెలబ్రిటీల నగ్న వీడియోలు

హనీట్రాప్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఏకంగా సినీ స్టార్లే అడ్డంగా బుక్కయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది సెలబ్రిటీలు ట్రాప్‌లో

Celebrities : షాకింగ్.. 100 మంది సెలబ్రిటీల నగ్న వీడియోలు

Celebrities

Celebrities : హనీట్రాప్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఏకంగా సినీ స్టార్లే అడ్డంగా బుక్కయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది సెలబ్రిటీలు ట్రాప్‌లో చిక్కుకున్నారు. కేటుగాళ్లు వారి న్యూడ్ విజువల్స్ రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ముంబై సైబర్‌ క్రైమ్‌ సెల్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. సెక్స్‌టార్షన్ గ్యాంగ్ బాధితుల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, సంపన్నులు ఉన్నారు.

కొందరు వ్యక్తులు ముందుగా సోషల్ మీడియాలో పరిచయం అవుతారు. హైప్రొఫైల్ వ్యక్తులుగా తమను తాము పరిచయం చేసుకుంటారు. ముందు చాటింగ్ తో మొదలు పెడతారు. నమ్మకంగా ఉంటున్నట్టు నమ్మిస్తారు. ఆ తర్వాత వీడియో కాల్స్ చేస్తారు. ఆ పై న్యూడ్ ఫోటోస్.. న్యూడ్ విజవల్స్ సేకరిస్తారు. ఆ తర్వాత అసలు కథ షురూ చేస్తారు. వాటిని సెలబ్రిటీలకు పంపి బ్లాక్ మెయిల్ చేస్తారు. డబ్బు డిమాండ్ చేస్తారు. బాలీవుడ్‌ను షేక్‌ చేసిన సెక్స్‌టార్షన్ గ్యాంగ్ కథ ఇది. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఈ ఫిర్యాదులు పెరగడంతో దర్యాఫ్తు చేపట్టారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100మంది సెలబ్రిటీల నగ్న వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

ముంబై సెక్స్‌టార్షన్ గ్యాంగ్ పేరు వినపడితేనే బాలీవుడ్ షేక్‌ అయిపోతోంది. మొదట స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ షిప్ చేస్తారు. 6 నెలలు నమ్మకం కుదిరాక ట్రాప్ లోకి దింపుతారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడి.. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. మొత్తం ఊడ్చేస్తారు. అంతటితో ఆగదు వీరి అరాచకం. ఆ తర్వాత అదే వీడియోలను డార్క్‌వెబ్ వంటి ఫోర్న్ సైట్లకు అమ్ముతారు. ఇలా రెండు విధాలుగా డబ్బు సంపాదిస్తారు. ఏకంగా ట్విట్టర్‌లో పెట్టేసి వీడియోలు అమ్మిన కేటుగాళ్లూ ఉన్నారు.

ముంబై సైబర్ సెల్‌కి సెలబ్రిటీల నుంచి ఫిర్యాదు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్స్. నిందితుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నాడు. ఈజీ మనీ, జల్సాలకు అలవాటుపడి ఇలా సెక్స్‌టార్షన్ గ్యాంగ్ అవతారమెత్తినట్టు పోలీసులు తెలిపారు.