పెంపుడు కుక్క అరుస్తోందని మహిళా కొట్టి చంపారు

పెంపుడు కుక్క అరుస్తోందని మహిళా కొట్టి చంపారు

ఓ ముంబై యువతి పెంచుకుంటున్న కుక్క కారణంగా ప్రాణాలు విడిచింది. ఇరుగుపొరుగు వారే ఆమెను కొట్టి చావుకు కారణమయ్యారు. దానికి కారణమేంటో తెలుసా ఆమె పెంచుకుంటున్న కుక్క గ్యాప్ లేకుండా అరుస్తూ ఉండటమే. ముంబైలోని డాండివ్లి ప్రాంతానికి చెందిన 35ఏళ్ల నాగమ్మ శెట్టి పెంపుడు కుక్క కొద్ది గంటలుగా అరుస్తూనే ఉంది. 

వితంతువు అయిన నాగమ్మ కూతురితో పాటు అపార్ట్ మెంట్‌లో నివాసముంటుంది. అరుస్తున్న కుక్కను పట్టించుకోవడం లేదేంటని నలుగురు మహిళలు నాగమ్మను నిందించారు. వాదన పెరిగింది. దీంతో వారంతా దాడికి దిగి నాగమ్మను గుండెలపై తన్ని కిందకు నెట్టేశారు. కొందరు గొడవను అడ్డుకొనేసరికే నాగమ్మ శెట్టి అనారోగ్యానికి గురైంది. 

కేసు పెట్టేందుకు బాధిత మహిళ స్టేషన్‌కు వెళ్లింది. ముందు చికిత్స చేయించుకోవాలని సూచించారు. పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిన మహిళకు ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లే క్రమంలోనే మృతి చెందింది. పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు గుండెనొప్పితో చనిపోయినట్లు నిర్దారించారు. పోలీసులు యాక్సిడెంటల్ డెత్ కింద నమోదు చేశారు.