కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు

  • Published By: bheemraj ,Published On : August 19, 2020 / 03:43 PM IST
కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు

మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నాగరాజుకు మధ్యవర్తిగా ఉన్న అంజిరెడ్డికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అంజిరెడ్డి నివాసంలో ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ దొరకడంతో వీరిద్దరికి సంబంధాలు ఉన్నాయని అనుమానాలు బలపడుతున్నాయి.



గతంలో విలువైన భూముల వివరాలు కోసం రేవంత్ రెడ్డి ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ కాపీలన్ని అంజిరెడ్డి నివాసంలో దొరకటంతో ఏసీబీ అధికారులు విస్తుపోయారు. ఆర్టీఐ వివరాల ఆధారంగా భూ యజమానిని బ్లాక్ మెయిల్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం తహసీల్దారు నాగరాజుతో సహ నలుగురు నిందుతుల్ని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు.

కీసర తహసీల్దారు నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రూ.కోటి 10 లక్షల లంచమిస్తూ నాగరాజు పట్టుబడ్డారు. మధ్యవర్తిగా ఉన్న అంజిరెడ్డికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ససంబంధాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన తర్వాత అంజిరెడ్డి శ్రీనాథ్ ఇంట్లో ఏసీబీ అధికారులు రెండురోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు.



అందులో ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లెటర్స్ ప్యాడ్స్ ను కూడా అంజిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరహాలో అంజిరెడ్డికి, రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. తహసీల్దారు నాగరాజు కేసులో కొంత కాంగ్రెస్ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఆ తరహాలోనే ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

గతంలో అంజిరెడ్డి ఇంట్లో దొరికిన లెటర్ ప్యాడ్స్ ఆధారంగా ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ లెటర్ ప్యాడ్స్ లో ప్రధానంగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆర్టీఏకు విలువైన భూములకు సంబంధించినటువంటి వివరాలు కోరుతూ గతంలో సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ అంజిరెడ్డి ఇంట్లో దొరికింది.