Car Accident : ముహూర్తం బాగోలేదు…కొన్న గంటకే కారు యాక్సిడెంట్

కొత్తగా కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా కారు టైరు పేలి అదుపు తప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

Car Accident : ముహూర్తం బాగోలేదు…కొన్న గంటకే కారు యాక్సిడెంట్

Tirupati Car Accident

Car Accident :  కొత్తగా కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా కారు టైరు పేలి అదుపు తప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి అక్కారంపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ అనే వ్యక్తి    ఈ రోజు మధ్యాహ్నం   కొత్త కారును కొనుగోలు చేశారు.

ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ సమీపంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తుండగా స్థానిక   ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద కారు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పాదచారులపైకి, వాహనాలపైకి దూసుకెళ్లింది.

Also Read : Firecrackers Blast : బాబోయ్… బైక్‌పై వెళ్తుండగా బాంబుల్లా పేలిన టపాసులు.. తండ్రి, ఏడేళ్ల కొడుకు మృతి

ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. 12 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే కారు యజమాని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.