హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి దందా : లిక్విడ్‌గా మార్చి విక్రయం

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 08:56 AM IST
హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి దందా : లిక్విడ్‌గా మార్చి విక్రయం

హైదరాబాద్ లో కొత్తరకం గంజాయి దందా బయటపడింది. గంజాయిని లిక్విడ్ రూపంతో తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకువచ్చి చిన్న బాటిల్స్ లో నింపి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. బిర్యానీ ఫుడ్ కలర్స్ లో బాటిళ్లలో తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. గంజాయి బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్ లోని అమిన్ పూర్ లోని ఓ ఇంట్లో కొంతమంది గతకొంతకాలంగా ఈ దందా కొనసాగిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. తేనే, లిక్విడ్, బిర్యానీ ఫుడ్ కలర్స్ రూపంలో బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారు. వైజాగ్ నుంచి తెచ్చిన గంజాయిని విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు బాటిల్స్ లలో విక్రయిస్తున్నారు. కొంతమంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్, బెంగళూరులలో ఈ దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అదుపులోకి తీసుకున్న ఇద్దరి నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దందా వెనుక ఎవరెవరున్నారు? అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు.