లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు… పైలట్‌ మొగుడి పైశాచికత్వం

  • Published By: bheemraj ,Published On : June 27, 2020 / 08:00 PM IST
లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు… పైలట్‌ మొగుడి పైశాచికత్వం

లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా బయటపడ్డ వీడియోలో పైలట్‌ మొగుడి పైశాచిక చర్యలు వెలుగుచూస్తున్నాయి. ప్రేమ పేరుతో లావణ్య వెంటపడ్డ వెంకటేశ్‌ వివాహమైన అనంతరం ఆమెను వదిలించుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. పిల్లలు పుట్టడం లేదనే సాకుతో ఆమెను నిత్యం వేధించేవాడని వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

లావణ్య కళ్లముందే వెంకటేశ్‌ పలువురు యువతులతో సరసాలు ఆడేవాడని, వారితో న్యూడ్‌గా మాట్లాడి ఆమెను మానసికంగానూ టార్చర్‌ చేసేవాడని తెలిసింది. వెంకటేశ్‌ ఆగడాలపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, లావణ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్‌ను అరెస్టు చేశారు. ఉస్మానియాలో పోస్టు మార్టం పూర్తి చేసిన తర్వాత లావణ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాళ్లగూడకు చెందిన లావణ్య (32) భర్త వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త వెంకటేశం జెట్‌ ఎయిర్‌ వేస్‌ పైలట్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. తన చావుకు భర్తే కారణమంటూ లావణ్య ఫేస్‌బుక్‌లో ఓ వీడియో విడుదల చేసింది.

‘‘వాడి మీద ప్రేమ ఉంది.. అందుకే సూసైడ్‌ చేసుకుంటున్నాను. వాడు చేసేవి తట్టుకోలేక చనిపోతున్నాను. ఒకసారి ప్రేమిస్తే చచ్చేవరకు ప్రేమించాలని అనుకున్నాను. నేను తప్పులు చేసి రియలైజ్‌ అయ్యాను. కానీ, వాడు అవ్వటం లేదు… ’’ అంటూ ఆమె కంటతడి పెట్టుకుంది.

మరోవైపు లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు.