ఫోరెన్సిక్ రిపోర్టు పనికిరాదు.. అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్య జరిగి 12ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కిరాలేదు. నిందితులు ఎవరన్న విషయంపై ఇప్పటిదాకా

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 03:35 PM IST
ఫోరెన్సిక్ రిపోర్టు పనికిరాదు.. అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్య జరిగి 12ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కిరాలేదు. నిందితులు ఎవరన్న విషయంపై ఇప్పటిదాకా

అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్య జరిగి 12ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కిరాలేదు. నిందితులు ఎవరన్న విషయంపై ఇప్పటిదాకా అటు పోలీసులు గానీ.. ఇటు సీబీఐగానీ తేల్చలేకపోయింది. అయితే… ఇప్పుడిప్పుడే ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ స్టూడెంట్ అయేషా మీరా హత్య కేసులో ఒకటికాదు.. రెండుకాదు.. అనేక మలుపులు! మరెన్నో అనుమానాలు! సిట్‌ దర్యాప్తులోను చిక్కని ఆధారాలు. 2007 డిసెంబర్ 7న జరిగిన ఈ  హత్య కేసులో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు. వాటన్నిటికి చెక్‌ చెప్పేందుకే హత్య జరిగిన పన్నెండేళ్ల తర్వాత రంగంలోకి దిగింది సీబీఐ. ఈ మర్డర్ మాటున దాటిన నిజాల నిగ్గు తేల్చేపనిలో పడింది. అందులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో అయేషా భౌతిక కాయానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించింది. మతపెద్దలు ఒప్పుకోకున్నా కోర్టు అనుమతి ద్వారా అయేషా డీఎన్‌ఏను సేకరించింది. వాటన్నింటిని సెంట్రల్‌ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించింది.

సీబీఐ జరిపిన రీపోస్టుమార్టంపై CSFL రిపోర్టిచ్చింది. ఈ నివేదికలో కీలక అంశాలను పొందుపర్చింది. హత్య జరిగిన సమయంలో అయేషా తల భాగంలోని ఎముక విరిగిందని తెలిపింది. అంతేకాదు… ఎముకపై బలమైన గాయమున్నట్లు గుర్తించింది. మరోవైపు… డీఎన్ఏ రిపోర్టు కూడా వచ్చింది. వీటి ఆధారంగా ఈ కేసును ఛేదించేందుకు సీబీఐ దూకుడు పెంచనుంది.

అయేషా మీరా కేసులో సీబీఐ అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప.. రీ పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికతో ఉపయోగం లేదంటున్నారు సీనియర్‌ ఫోరెన్సిక్ నిపుణులు. ఫోరెన్సిక్‌ నివేదికలో చనిపోయిన వ్యక్తి అమ్మాయా కాదా ఆమె వయసు ఎంత అన్నది మాత్రమే తెలుస్తుందన్నారు.